Love Mouli: 42 లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్‌, బోల్డ్ డైలాగ్స్ బోలెడున్నాయ్.. అయినా ఇది లస్ట్ సినిమా కాదు

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:36 PM

టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. సింగిల్‌ కట్‌ లేకుండా సెన్సార్ నుండి ‘ఏ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్‌ 7న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అవనీంద్ర తాజాగా మీడియాతో పంచుకున్నారు.

Love Mouli: 42 లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్‌, బోల్డ్ డైలాగ్స్ బోలెడున్నాయ్.. అయినా ఇది లస్ట్ సినిమా కాదు
Director Avaneendra

టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ (Navdeep) సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ 2.O (Navdeep 2.0)గా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’ (Love, Mouli). ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) శిష్యుడు అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌ సినిమాపై ఆసక్తిని పెంచగా.. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్‌ కట్‌ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ నుండి ‘ఏ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్‌ 7న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అవనీంద్ర (Director Avaneendra) తాజాగా మీడియాతో పంచుకున్నారు.

వైజాగ్‌లో ‘ల‌వ్‌, మౌళి’ ప్రీమియ‌ర్స్‌ వేశారు కదా.. ఎలాంటి స్పంద‌న వ‌చ్చింది?

ఇటీవల వైజాగ్‌లో ‘లవ్,మౌళి’ ప్రత్యేక షో వేయడం జరిగింది. ఈ షోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా వాళ్లకు షో వేస్తే.. అందరూ బాగుందనే అంటారు. బాలేదని ఎవరూ చెప్పలేదు. అందుకే కొంతమంది చెప్పేదే నేను నమ్ముతాను. కీరవాణిగారి బ్రదర్ కాంచీగారు ఏమున్నా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. అలాంటి వారి ఓపెనియన్‌ని నేను బాగా నమ్ముతాను.

సినిమా విడుద‌ల‌కు 3 రోజుల ముందు ప్రివ్యూ వేయడం రిస్క్ అనిపించ‌లేదా?

వైజాగ్‌లో ప్రివ్యూ వేయడానికి కూడా ముందు ఆలోచించాం. టాక్ బయటికి వెళ్లిపోతుందేమో అని అనుకుని కూడా.. టెస్ట్ చేద్దామని అనుకున్నాం. అలా అనుకుని బుకింగ్ ఓపెన్ చేయగా.. వెంటనే అయిపోయాయి. అప్పుడర్థమైంది జనాలు కూడా సినిమా చూడడానికి ఆసక్తిగా ఉన్నారని. సినిమా చూసిన వారంతా ఎంజాయ్ చేశారు. నేను ఊహించని చోట కూడా వారు ఎంగేజ్ అయి ఎంజాయ్ చేయడం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. (Director Avaneendra Interview About Love, Mouli)

ఈ క‌థ‌లో న‌చ్చే ఎలిమెంట్స్ ఏమిటి?

ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంతమంది లొకేషన్స్, కొంతమంది హీరోయిన్ క్యారెక్టరైజేషన్.. ఇలా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.

ఎన్నో కమర్షియల్ కథలు రాసిన మీరు.. ఇలా బోల్డ్ క‌థ‌తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం కావ‌డానికి కార‌ణం?

ఈ కథ అనుకున్నప్పుడు నేను ‘ఆర్ఆర్ఆర్’ రైటింగ్‌లో ఉన్నాను. నేను ఆ సినిమాకు అసోసియేట్ రైటర్‌ని. అప్పుడే మా టీమ్ అంతా నువ్వు డైరెక్ట్ చేసే సమయం ఆసన్నమైందంటూ ప్రోత్సహించారు. అయితే నేను కమర్షియల్ కథలు ఎన్నో అప్పటికే రాసేశాను. ఏ కథ రాస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తూ కొత్తగా ఏదైనా ప్రేక్షకులకు రిఫ్రెష్ అనిపించేలా కథ ఉండాలని అనుకున్నాను. ఒకవైపు ఆర్ఆర్ఆర్ రాస్తున్నప్పుడే పేరలల్‌గా ఈ పాయింట్ అనుకున్నాను. ఆర్ఆర్ఆర్‌తో పాటు అప్పటికే ఓకే చేసిన కథలన్నీ పూర్తి చేసి ఈ కథపై కూర్చున్నా.


Avaneendra.jpg

హీరో న‌వ‌దీప్ కోస‌మే ఈ క‌థ త‌యారు చేశారా?

కథ రాస్తున్నప్పుడు మనం ఎవరినో ఒకరిని ఊహించుకుంటూ రాయాలి. ఈ కథకి అలా ఊహించుకోవడం చాలా కష్టం. ఈ ఒక్క కథకి ఎవరినీ ఊహించుకోకుండా ఒక నవలలా కథ రాసేశా. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరి ఫొటోలు గోడపై పెట్టి కథకి ఊహించుకుంటూ వచ్చా. అయితే ఆ ఫొటోలలో అప్పుడు నవదీప్ ఫొటో లేదు. అప్పుడు నవదీప్ కూడా అంత యాక్టివ్‌గా సినిమాలు చేయడం లేదు. అప్పుడు నాకెందుకో నవదీప్ అయితే అనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనలన్నీ అతనిపై పెట్టి.. ఆ తర్వాత వెళ్లి కథ చెప్పా. కథ వినగానే ఎగిరి గంతేశాడు. ఇలాంటి కథ కోసం ఎప్పటి నుండో చూస్తున్నానని చెప్పాడు. నేను అనుకున్న లుక్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యాడు. (Director Avaneendra Interview)

నవదీప్ అంటే.. మార్కెట్ ఈక్వేష‌న్స్ ప‌ట్టించుకోలేదా?

నవదీప్ అయితే.. మార్కెట్ అవి ఇవీ ప్రాబ్లమ్స్ ఉంటాయని అంతా అన్నారు కానీ.. ఫస్ట్ సినిమా, ఈ ఒక్క కథని నిజాయితీగా చేద్దాం అని ఫిక్సయ్యా. రిజల్ట్‌తో సంబంధం లేదు.. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా.. ఫస్ట్ సినిమా నిజాయితీగా చేశానని చెప్పుకోవడానికి ఉంటుందనేలా నిర్ణయించుకున్నా.

హీరో బ్రాలో మందు తాగ‌డం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా?

అవును.. లో దుస్తులని పబ్లిగ్గా ఆరేయడానికి సంకోచించే మైండ్ సెట్ మనది. నాకున్న కథ, స్క్రీన్‌ప్లే టైమ్‌ని దృష్టిలో పెట్టుకుని.. హీరో క్యారెక్టర్‌ ఇదని చెప్పడం కోసమే.. హీరో ఇన్నర్ దుస్తుల్లో మందు తాగడం చూపించడం జరిగింది. ఇందులో హీరోకి ఎటువంటి సెన్సిబిలిటీస్ ఉండవు. ఆ పాత్రని అలా పరిచయం చేస్తేనే జనాల్లోకి వెళుతుంది. నిజంగా అలాంటి సీన్ డిస్టర్బ్‌గా అనిపిస్తే సెన్సార్ వాళ్లు చూసుకుంటారు. వైజాగ్‌లో షో‌కి 50 శాతం అమ్మాయిలే వచ్చారు. ఎవరూ ఒక్కరు కూడా దీనిపై ప్రశ్నించలేదు. పోస్టర్‌లో అలా అనిపిస్తుంది కానీ.. సినిమా చూశాక అందరికీ ఆ సీన్ అర్థమవుతుంది.

సెన్సారు వాళ్లు ఈ సినిమాకు ఏ స‌ర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు?

సెన్సార్ వాళ్లు యుబైఏ సర్టిఫికెట్ ఇస్తామని అన్నారు కానీ 20 కట్స్ చెప్పారు. కానీ ఆ కట్స్ వల్ల కథ ఫ్లో పోతుంది. కథ కథగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అంటే.. అయితే ‘ఏ’ ఇస్తాం అన్నారు. నేను ముందుగానే ‘ఏ’కి ప్రిపేరై ఉన్నా. ‘ఏ’ కావాలని మాత్రం అడగలేదు.. ప్రిపేర్ అయి ఉన్నా. ఎందుకంటే, 18 ప్లస్‌కి అవసరమైన కథ ఇది.

ఈ సినిమా బ‌డ్జెట్ లిమిట్ దాటిందా?

లాక్‌డౌన్ టైమ్‌లో షూటింగ్ నిమిత్తం చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవమే కానీ.. దాని వల్ల బడ్జెట్ పెరగడం అంటూ ఏమీ జరగలేదు. ఎందుకంటే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌ని కూడా నేనే. ముందుగానే అన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నా.

కొత్త‌వాళ్ల‌ను హీరోయిన్లుగా తీసుకోవడానికి కారణం?

ఇది ఫాంటసీ బేస్డ్ స్టోరీ.. ఒక ఆర్టిస్ట్ తన కాన్వాస్ మీద ఊహా చిత్రం వేస్తే.. అందులో నుంచి ఆ అమ్మాయి బయటికి వచ్చేస్తుంది. అందుకే కొత్త హీరోయిన్లని తీసుకోవడం జరిగింది. ఆడియన్స్ కూడా నిజంగానే వచ్చేసిందనే ఫీల్ పొందాలి. ఒకవేళ తెలిసిన హీరోయిన్ అయితే.. ఆడియన్ ఆ ఫీల్ పొందలేరు. అందుకే కొత్తవాళ్లని తీసుకున్నాం.

ప్రేమ‌క‌థ‌ (Love Story)ల్లో ఇది సరికొత్త‌గా వుంటుందా?

ఫాంటసీ బేస్‌తో మొదలైనప్పటికీ ఆ తర్వాత వచ్చే స్టోరీ రియల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆ పాత్రని ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారు. ఇంకా చెప్పాలంటే యథార్థ సంఘటనల నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రమిది. రిలేషన్‌లో ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఈ పాయింట్ అందరికీ నచ్చుతుందని లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కించాను. ఇంకా చెప్పాలంటే లస్ట్ కోసం చేసిన సినిమా కాదు లవ్ కోసం చేసిన సినిమా ఇది.

Also Read- Pawan Kalyan: పవర్ స్టార్ నిజజీవితంలో కూడా పవర్ ఫుల్, హోమ్ మినిస్టర్?

అసలు ఈ సినిమా ద్వారా మీరు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి?

ఒక రిలేషన్‌ మొదలైనప్పుడు చిన్న చిన్న తప్పుడు కనిపించవు. ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత అప్పటి వరకు ఉన్న ప్రేమ దూరమై.. చిన్న ఇష్యూ కూడా ఇద్దరి మధ్య బ్రేకప్‌కి కారణం అవుతుంది. నా దృష్టిలో ప్రేమంటే నాకు నచ్చినట్టు ఉండమనడం కాదు.. నాకు నచ్చకపోయినా.. నిన్ను నీలా ఉండనీయడం ప్రేమ. అదే ఇందులో చెప్పదలచుకున్నాను

ఈ సినిమా నేప‌థ్యం సంగీతం గురించి?

తమిళ్‌లో ‘96’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఇద్దరి మధ్యే ఉంటుంది. కానీ ఎమోషన్స్ మొత్తం మ్యూజిక్ క్యారీ చేస్తుంది. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ఈ సినిమాకు కూడా అలాంటి మ్యూజిక్కే అవసరం. అందుకే గోవింద్ వసంత్‌‌ని తీసుకోవడం జరిగింది. టెర్రిఫిక్‌గా మ్యూజిక్ ఇచ్చారు. మా ఇద్దరి మధ్య బ్యూటీఫుల్ జర్నీ జరిగింది. ఈ సినిమాని చూసిన తర్వాత అందరూ పాటలు ఎక్కువగా పాడుకుంటారు.


ఈ సినిమా తీస్తున్నట్లుగా రాజ‌మౌళి‌తో చెప్పారా?

విజయేంద్ర ప్రసాద్‌గారికి ఈ కథ చెప్పినప్పుడు బూతులు తిట్టారు. ఎందుకురా నీకు ఇది. కమర్షియల్‌గా వెళ్లక అని అన్నారు. మా ఇద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధం ఉంటుంది. నన్ను ఆయనకి దత్తపుత్రుడు అనే వారు. అంత చనువు ఉంది ఆయన దగ్గర. కాంచీ అన్న కూడా సేమ్ రెస్పాన్స్. నా దృష్టిలో ఇది కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలు రాసిన అలవాటుతో ఈ కథ రాశాను. షూటింగ్ అయిన తర్వాత ఒక వీడియో ప్రసాద్‌గారికి చూపించాను. కీరవాణిగారికి చూపించాను.. ఆశ్చర్యపోయారు.

Also Read- Akira Nandan: నాన్న కోసం.. అకీరా నందన్ టాలెంట్‌కు అంతా ఫిదా!


ఈ చిత్రంలో 42 లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్‌, డైలాగ్స్ వున్నాయ‌నేలా టాక్ వినబడుతోంది. కథకు అవ‌స‌ర‌మా?

ఇందులో బోల్డ్ డైలాగ్స్, లిప్ లాక్స్ బోలెడన్నీ ఉంటాయి. అవన్నీ కావాలని పెట్టినవి కాదు. కథకు అవసరమై పెట్టినవే. కమర్షియల్ మీటర్ తెలిసిన వాడిని కాబట్టి.. కథ రాసుకుంటున్నప్పుడు ఈ కథతో ఆడియన్స్‌ని రంజింపచేయడానికి అవసరమైన వన్నీ చేర్చడం జరిగింది. కరోనా తర్వాత జనాలు ప్రపంచ సినిమాను (World Cinema) చూస్తున్నాను. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా ఐటమ్ సాంగ్స్ (Item Songs) దగ్గరే ఉంది. ఈ కథకి అన్నీ అలా కుదిరాయ్.

‘ల‌వ్‌, మౌళి’ (Love Mouli) టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏమిటి?

ప్రేమతో ప్రశాంతంగా లవ్ మూడ్‌లో కూర్చున్న శివుడిని మౌళి అంటారు. ఈ సినిమాకు ఆ పేరు పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది. అది సినిమా చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఈ స్టోరీకి చాలా ప్రత్యేకత ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్టోరీని మార్చడానికి ఏం ఉండదు.

మీ త‌దుప‌రి చిత్రాలు?

నెక్ట్స్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లాంటి సినిమా చేయడానికి ప్రయత్నిస్తా. ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ (RRR Sequel) చేసే స్కోప్ ఉంది. కథకి అయితే స్కోప్ ఉంది. కానీ చేస్తారా? చేయరా? అనేది రాజమౌళిగారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ చేసేటప్పుడే తర్వాత సినిమా మహేష్ బాబు (Mahesh Babu)తో అని తెలుసు. మహేష్ బాబు కోసం ఎటువంటి సినిమా చేయాలా? అని రాజమౌళిగారు అందరినీ అడిగారు. చాలా జానర్స్ అనుకున్నాం కానీ.. ఫైనల్‌గా అడ్వంచర్ సినిమా అని టీమ్‌లో ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యారు. అంతా అనుకున్నాకే.. స్టోరీ ప్రారంభమైంది. ఆ సినిమా గురించి అంత వరకే చెప్పగలను.

Read Latest Cinema News

Updated Date - Jun 06 , 2024 | 12:36 PM