Vairamuthu: సంగీతం గొప్పదా? భాష గొప్పదా?
ABN, Publish Date - Apr 30 , 2024 | 04:12 PM
సంగీతం గొప్పదా? భాష గొప్పదా? అంటూ ప్రముఖ గేయ రచయిత వైరముత్తు ప్రశ్నించారు. ముత్తుకుమార్ నిర్మాణంలో సెల్వం మతప్పన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పడిక్కాద పక్కంగల్’ చిత్ర ఆడియోను తాజాగా చెన్నై నగరంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైరముత్తు.. ఈ ప్రశ్నకు వివరణ ఇచ్చారు.
సంగీతం గొప్పదా? భాష గొప్పదా? అంటూ ప్రముఖ గేయ రచయిత వైరముత్తు (Vairamuthu) ప్రశ్నించారు. ముత్తుకుమార్ నిర్మాణంలో సెల్వం మతప్పన్ (Selvam Mathappan) దర్శకత్వం వహించిన చిత్రం ‘పడిక్కాద పక్కంగల్’ (Padikkadha Pakkangal) చిత్ర ఆడియోను తాజాగా చెన్నై నగరంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైరముత్తు మాట్లాడుతూ ‘ఒక పాటలో సంగీతం గొప్పదా? భాష గొప్పదా? అనేది ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారిందని,. సంగీతం ఎంత గొప్పదో.. భాష కూడా అంతే గొప్పదని,. భాష ఎంత గొప్పదో.. సంగీతం కూడా అంతే గొప్పదని,. ఈ రెండూ కలిస్తేనే పాటగా మారుతుందని చెప్పారు. (Padikkadha Pakkangal Audio Launch Event)
*Raashi Khanna: రాశి'ఫలం' బాగోలేదు
కొన్ని సందర్భాల్లో భాష కంటే సంగీతం (Music) గొప్పదిగా, మరికొన్ని సందర్భాల్లో భాష (Language) గొప్పదిగా ఉన్నట్టు కనిపిస్తుందని ఈ విషయాన్ని గ్రహించి, అర్థం చేసుకున్నవారే జ్ఞానులన్నారు. పాటకు పేరు పెట్టేది భాషనా? లేక సంగీతమా? అంటే పాటకు పేరు పెట్టేది భాష మాత్రమేనని, దానికి అందం, అభినయం చేకూర్చిపెట్టేది సంగీతమని అన్నారు. ఈ విషయాన్ని విస్మరించలేమని, సంగీతం, భాష రెండు పరస్పరం సమ్మేళనం అయితేనే కళ అభివృద్ధి చెందుతుందని తాను బలంగా నమ్ముతానన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రిజన్ (Prajin), సంగీత దర్శకుడు సిర్పి తదితరులు పాల్గొన్నారు.
Read Latest Cinema News