Vairamuthu: మహిళలు ఏరి? తమిళ చిత్రసీమలో ఆ నాటి స్వర్ణయుగమేది?

ABN , First Publish Date - 2023-11-08T17:30:59+05:30 IST

తమిళ సినిమా స్వర్ణయుగం అంటే మహిళలకు సమాన స్థానం కల్పించిన సినిమా అని, ఆ స్వర్ణయుగాన్ని మళ్ళీ తలపించేలా ‘కట్టిల్‌’ సినిమాను నిర్మాత, దర్శకుడు, హీరో గణేష్‌బాబు తీశారని ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అన్నారు. మాపిల్‌ లీఫ్స్‌ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిన చిత్రం ‘కట్టిల్‌’. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ని చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

Vairamuthu: మహిళలు ఏరి? తమిళ చిత్రసీమలో ఆ నాటి స్వర్ణయుగమేది?
Vairamuthu at Kattil Song Launch

తమిళ సినిమా (Tamil Cinema) స్వర్ణయుగం అంటే మహిళలకు సమాన స్థానం కల్పించిన సినిమా అని, ఆ స్వర్ణయుగాన్ని మళ్ళీ తలపించేలా ‘కట్టిల్‌’ (Kattil) సినిమాను నిర్మాత, దర్శకుడు, హీరో గణేష్‌బాబు (Ganesh Babu) తీశారని ప్రముఖ గేయ రచయిత వైరముత్తు (Vairamuthu) అన్నారు. మాపిల్‌ లీఫ్స్‌ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిన చిత్రం ‘కట్టిల్‌’. ప్రముఖ ఎడిటర్‌ బి.లెనిన్‌ కథ, స్ర్కీన్‌ప్లే సమకూర్చగా, ఈవీ గణేష్‌బాబు నిర్మించి దర్శకత్వం వహించి నటించారు. ఈ చిత్ర ఫస్ట్‌ సింగిల్‌ సాంగ్‌ రిలీజ్‌ వేడుక (Kattil First Single Launch) తాజాగా చెన్నై (Chennai) నగరంలో జరిగింది. ఈ వేడుకలో గేయ రచయిత వైరముత్తు, సినీ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ సహా చిత్ర ప్రధాన తారాగాణం పాల్గొంది.

Kattil.jpg

ఈ కార్యక్రమంలో వైరముత్తు ((Vairamuthu)) మాట్లాడుతూ.. పాత సినిమా పోస్టర్లు చూస్తే అందులో ఎక్కువగా మహిళలు కనిపించేవారు. అది తమిళ సినిమా స్వర్ణయుగం. అలాంటి యుగాన్ని మళ్లీ కనిపించేలా ‘కట్టిల్‌’ చిత్రంలో హీరో గణేష్‌ బాబు కృషి చేశారు. చిన్న చిత్రాలు తమిళ సినీ ఇండస్ట్రీకి ఎంతో ముఖ్యం. ఇలాంటి చిత్రాల వల్లే అనేక మంది కొత్త టెక్నీషియన్లు పుట్టుకొస్తారు. కన్నదాసన్‌, వాలి వంటి గొప్ప రచయితలతో నేను పోటీ పడ్డాను. వారిస్థాయికి చేరుకోలేనని నాకు తెలుసు. కానీ, వారున్నకాలంలో నేను కూడా ఉన్నాను అని గర్వంగా భావించాను. ఇపుడు కూడా మదన్‌గార్గీ వంటివారితో పోటీ పడుతున్నానని అన్నారు.


Vairamuthu.jpgదర్శకుడు కేఎస్ రవికుమార్‌ (KS Ravikumar) మాట్లాడుతూ.. ఒక నటుడిగా సుధీర్ఘ అనుభవం కలిగిన ఈవీ గణేష్‌బాబు ఈ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించారు. ఆయనకు నా శుభాకాంక్షలు. నా చిత్రాలకు దేవా సంగీతం సమకూర్చే సమయంలో కీబోర్డు ప్లేయర్‌గా శ్రీకాంత్‌ దేవా ఉండేవారు. ఇప్పుడు ఒక మంచి సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిత్ర దర్శక, హీరో, నిర్మాత గణేష్‌బాబు మాట్లాడుతూ... ‘ఎడిటర్‌ లెనిన్‌ జీవితంలో జరిగిన సంఘటనలే ఈ చిత్ర కథ. చాలా మంచి స్టోరీని అందించారు. శ్రీకాంత్‌ దేవా (Srikanth Deva)కు ఇది 101వ చిత్రం. ఆయనకు నా లఘు చిత్రం ద్వారా జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. శ్రీకాంత్‌ దేవా ఒక అక్షయ పాత్ర వంటివారు. మనం అనుకున్నదానికంటే అనేక రెట్లు ఎక్కువగా ఇస్తారు. ఈ సినిమా కోసం నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని తెలిపారు. అలాగే, హీరోయిన్‌ సృష్టి డాంగే (Srushti Dange) సహా చిత్ర బృంద సభ్యులు ప్రసంగించారు.


ఇవి కూడా చదవండి:

========================

*Tiger 3: ‘టైగర్ 3’.. యాక్షన్ ప్రియులకు పండగే.. ఎందుకంటే?

*******************************************

*Prabhu Deva Brother: అద్దె వివాదం.. ప్రభుదేవా సోదరుడు చేసిన పనికి పోలీసులు షాక్

*************************************

*Kannappa: ‘కన్నప్ప’కు అదే కరెక్ట్ అంటోన్న మంచు విష్ణు

*************************************

*NBK109: బాలయ్య మరో మాస్ రాంపేజ్ అప్‌డేట్.. పిక్ అదిరింది

*************************************

Updated Date - 2023-11-08T17:31:01+05:30 IST