మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Director Mysskin: ఆలయాలకు వెళ్ళొద్దు.. సినిమా థియేటర్లకు వెళ్ళండి

ABN, Publish Date - May 02 , 2024 | 08:21 PM

సినిమా ఒక దైవం లాంటిదని, ప్రతి ఒక్కరూ ఆలయాలకు కాకుండా, సినిమాలకు వెళ్ళాలని ప్రముఖ దర్శకుడు మిష్కిన్‌ పిలుపునిచ్చారు. తప్పు చేసేవారు, చేయబోయేవారు మాత్రమే ఆలయాలకు వెళ్తుంటారన్నారు. ఏ తప్పూ చేయనివారు, హాయిగా నవ్వుకుంటూ కొన్ని గంటల పాటు ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవారు సినిమాలకు వెళ్ళాలని సూచించారు. ‘ది ప్రూఫ్‌’ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Director Mysskin at The Proof Audio Launch

సినిమా ఒక దైవం లాంటిదని, ప్రతి ఒక్కరూ ఆలయాలకు కాకుండా, సినిమాలకు వెళ్ళాలని ప్రముఖ దర్శకుడు మిష్కిన్‌ (Director Mysskin) పిలుపునిచ్చారు. తప్పు చేసేవారు, చేయబోయేవారు మాత్రమే ఆలయాలకు వెళ్తుంటారన్నారు. ఏ తప్పూ చేయనివారు, హాయిగా నవ్వుకుంటూ కొన్ని గంటల పాటు ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవారు సినిమాలకు వెళ్ళాలని సూచించారు. గోల్డెన్‌ స్టూడియోస్‌ (Golden Studios) పతాకంపై నిర్మాత గోమతి నిర్మాణంలో కొరియోగ్రాఫర్‌ రాధిక మాస్టర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ప్రూఫ్‌’ (The Proof). సాయి ధన్సిక (Sai Dhanshika) ప్రధాన పాత్ర పోషించారు. రుత్వీర్‌ వదన్‌, మైమ్‌ గోపి, రిత్విక, ఇంద్రజ తదితరులు ఇతర పాత్రల్లో నటించగా, త్వరలోనే విడుదల చేయనున్న ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకులు మిష్కిన్‌, ఆర్వీ ఉదయకుమార్‌, నిర్మాత కె.రాజన్‌, గేయ రచయిత స్నేహన్‌, నటుడు రోబో శంకర్‌, సంతోష్‌ ప్రతాప్ పాటు చిత్ర బృందం పాల్గొంది.

*Baak: ‘బాక్’ .. విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది


ఈ కార్యక్రమంలో మిష్కిన్‌ మాట్లాడుతూ.. ‘సినిమా అనేది దైవం వంటిది. ఆ దైవాన్ని ప్రార్థించాలి. ఒక కుటుంబంలో ఆరుగురు సభ్యులుంటే కనీసం ఐదుగురు నెలలో ఒకరోజైనా సినిమాకు వెళ్ళాలి. సినిమా ఒక కళ. మూడు గంటలపాటు హాయిగా కాలాన్ని గడిపేయొచ్చు’ అని అన్నారు. హీరోయిన్‌ సాయి ధన్సిక మాట్లాడుతూ.. ‘చాలా మంది మహిళల ఎదుగుదలకు పురుషులు అడ్డంకిగా ఉంటారని చెబుతుంటారు. కానీ, నా కెరీర్‌ ఎదుగుదలకు పురుషులే కారణం. ఇకపై నాకు సినిమా అవకాశాలు వస్తాయా అనే ఆలోచనలో ఉండగా, వచ్చిన అవకాశమే ఈ చిత్రం. రాధికా డార్లింగ్‌ దర్శకురాలు అవుతారని ఊహించలేదు. స్టోరీ చాలా బాగుంది. దీపక్‌ ఐదేళ్ళ క్రితం చిన్నపిల్లవాడు. ఇపుడు నా చిత్రానికి సంగీతం అందించారు. మహిళ భద్రతను తెలిపే చిత్రంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. (The Proof Audio Launch)


దర్శకురాలు రాధికా మాస్టర్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సాయి ధనిష్క అద్భుతంగా నటించారు. ఈ సినిమా ద్వారా నా కుమారుడు సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారని, మీడియా బ్లెస్సింగ్స్‌ ఇవ్వాలని కోరారు. (The Proof Trailer Launch)

Updated Date - May 02 , 2024 | 08:21 PM