Pithala Maathi: ఉమాపతి హీరోగా ‘పిత్తల్ మాత్తి’.. కాన్సెప్ట్ అదిరింది
ABN, Publish Date - Jun 06 , 2024 | 10:24 AM
ప్రముఖ సీనియర్ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి హీరోగా నటించిన కొత్త చిత్రం ‘పిత్తల్ మాత్తి’. మాణిక్య విద్య దర్శకత్వం వహించారు. సంస్కృతి హీరోయిన్. ఇతర పాత్రల్లో బాల శరవణన్, వినుత, లాల్, తంబి రామయ్య, దేవదర్శిణి, విద్యుల్లేఖ, నరేన్, కాదల్ సుకుమార్ తదితరులు నటించారు. అణగారిన ప్రజల జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని శరవణ ఫిల్మ్ ఆర్ట్స్ పతాకంపై జి.శరవణన్ నిర్మించారు.
ప్రముఖ సీనియర్ నటుడు తంబి రామయ్య (Thambi Ramaiah) కుమారుడు ఉమాపతి (Umapathy) హీరోగా నటించిన కొత్త చిత్రం ‘పిత్తల్ మాత్తి’ (Pithala Maathi). మాణిక్య విద్య దర్శకత్వం వహించారు. సంస్కృతి హీరోయిన్. ఇతర పాత్రల్లో బాల శరవణన్, వినుత, లాల్, తంబి రామయ్య, దేవదర్శిణి, విద్యుల్లేఖ, నరేన్, కాదల్ సుకుమార్ తదితరులు నటించారు. ఎస్‌ఎన్ వెంకట్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి మోసెస్ స్వరాలు సమకూర్చారు. అణగారిన ప్రజల జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని శరవణ ఫిల్మ్ ఆర్ట్స్ పతాకంపై జి.శరవణన్ నిర్మించారు.
Also Read- Jr NTR: ఏపీ ఎన్నికల ఫలితాలపై రియాక్టైన తారక్.. ఏమన్నారంటే?
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. జీవితంలో మంచి చెడు కోసం ఏం చేయాలి అనే అంశంతో స్ర్కీన్‌ప్లే రూపొందించాం. కథలోని హీరో తన జీవితంలో ఏది మంచిది? చెడు అంటే ఏమిటి? ఈ విషయాలు తెలుసుకుని అతను జీవితంలో ఎలా ముందుకు వచ్చాడు? అనే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించగా ఈ నెలలో విడుదల చేయనున్నాం’ అని పేర్కొన్నారు. (Pithala Maathi Update)
కాగా, శరవణ ఫిల్మ్ ఆర్ట్స్ పతాకంపై ఇప్పటివరకు నాలుగు చిత్రాలు రాగా, అవి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. యోగిబాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘జోరా కై తట్టుంగ’ చిత్రాన్ని ‘పిత్తల్ మాత్తి’ విడుదల చేసిన తర్వాత రిలీజ్ చేస్తామని నిర్మాత శరవణన్ తెలిపారు.
Read Latest Cinema News