Family Star: అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్‌లోకి ‘ఫ్యామిలీ స్టార్’.. అందరూ రెడీనా!
ABN, Publish Date - Apr 25 , 2024 | 06:57 PM
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయింది. ఈ శుక్రవారం ఉదయం 12 గంటల నుంచి (అర్ధరాత్రి) అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఫ్యామిలీ స్టార్’ స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఇకపై ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయింది. ఈ శుక్రవారం ఉదయం 12 గంటల నుంచి (అర్ధరాత్రి) అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ‘ఫ్యామిలీ స్టార్’ స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఇకపై ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా మే 3వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అనేలా ఇప్పటి వరకు వార్తలు వినిపించాయి. అయితే అంతకంటే ముందే.. అంటే విడుదలైన 20 రోజులలోనే సినిమాను ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు.
*Salloni: ఈ తెలుగునటి ఒకప్పుడు సల్మాన్ ఖాన్ హీరోయిన్, తెలుసా...
విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరించారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్‌టైనర్‌గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల (Parasuram Petla) రూపొందించారు. అయితే థియేటర్లలో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం మంచి ఆదరణను పొందుతుందని, అందుకే ముందే ఓటీటీలో తీసుకొచ్చేస్తున్నారనేలా టాక్ వినబడుతోంది.
ఈ సినిమా కథ (Family Star Story) విషయానికి వస్తే.. గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆఖరివాడు. ఇద్దరు అన్నయ్యలు, వదినలు, వాళ్ళ పిల్లలు, బామ్మ, ఇలా ఒక మధ్యతరగతి కుటుంబంలో చిన్నవాడైన గోవర్ధన్ కుటుంబాన్ని తన భుజస్కందాలపై నడిపిస్తూ వుంటాడు. తన ఫ్యామిలీ సభ్యుల అవసరాలను తీర్చే గోవర్ధన్.. వారిని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు అంగీకరించడు.. ఎదురుతిరిగి తగిన బుద్ధి చెబుతుంటాడు. అలాంటి సమయంలో ఆ ఇంట్లోకి వస్తుంది ఇందు (మృణాల్ ఠాకూర్) అనే అమ్మాయి. గోవర్ధన్ ఉంటున్న ఇంట్లోనే మేడ మీద ఒక గది ఖాళీగా ఉంటే అద్దెకి దిగుతుంది. గోవర్ధన్ మొదట్లో ఆమెని వ్యతికేరించినా, మెల్లగా ఆమె చేస్తున్న పనులు నచ్చి ఆమెతో ప్రేమలో పడతాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటాడు. అదే సమయంలో ఆమె గోవర్ధన్ మీద ఒక థీసిస్ రాస్తుంది, అది తను చేసే మధ్యతరగతి కుటుంబం గురించిన రీసెర్చ్ అని యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తుంది. అందులో గోవర్ధన్ మధ్యతరగతి కుటుంబం గురించిన వివరాలు అన్నీ ఉంటాయి. గోవర్ధన్ ఆ పుస్తకం చదివి తన కుటుంబాన్ని మొత్తం రోడ్డుమీదకు ఇందు తీసుకువచ్చిందని, ఆమెని అసహ్యించుకుంటాడు. మధ్య తరగతి కుటుంబం అంటే పస్తులుండే కుటుంబం కాదని, తలుచుకుంటే మేము కూడా సంపన్నులం అవగలమని చూపిస్తాడు. వెంటనే తనకి ఇంతకు ముందు ఆఫర్ ఇస్తామన్న ఒక పెద్ద వ్యాపారవేత్త (జగపతి బాబు) దగ్గరికి వెళ్లి తాను ఇప్పుడు ఆ జాబ్ తీసుకుంటానని ప్రాధేయపడితే అతను గోవర్ధన్‌కి ఆ జాబ్ ఇస్తాడు, అలాగే రెండు సంవత్సరాల జీతం అడిగితే అది కూడా ముందే ఇస్తాడు. తాను మధ్యతరగతి కుటుంబం కాదని, ధనవంతుల కుటుంబం అని ఇందుకు చెప్తాడు, ఆమె మీద ద్వేషం పెంచుకుంటాడు. ఇంతకీ ఈ ఇందు అనే అమ్మాయి ఎవరు? ఆమె నిజంగానే గోవర్ధన్ మధ్యతరగతి కుటుంబాన్ని వీధిలోకి లాగడం కోసమే థీసిస్ రాసిందా? ఆ వ్యాపారవేత్త గోవర్ధన్ అడగగానే వుద్యోగం, జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడు? గోవర్ధన్, ఇందు మళ్ళీ కలిశారా? వాళ్ళు పెళ్లిచేసుకున్నారా? తరువాత ఏమైంది, గోవర్ధన్ జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Read Latest Cinema News