The Family Star: అయ్యబాబోయ్.. ఫ్యామిలీస్టార్ రివ్యూస్ ఏంటి ఇలా ఉన్నాయ్
ABN , Publish Date - Apr 05 , 2024 | 07:21 AM
విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఫ్యామిలీ స్టార్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో ప్రజల టాక్ ఎలా ఉందంటే..
ఖుషి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ (VijayDeverakonda) నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ (The Family Star). గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత పరశురాం (Parasuram Petla) , గోపీసుందర్ (Gopi Sundar), విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అంతేగాక టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడం, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా ఈ సినిమాకు జత కావడంతో చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అదీగాక ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లకు పబ్లిక్‌లో మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం విడుదల నేపథ్యంలో సినిమా రిలీజ్‌కు వారం పది రోజుల ముందు ప్రమోషన్స్ మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) లు ఎన్నడు లేనంతగా ప్రచార కార్యక్రమాలు వివిద రూపాల్లో నిర్వహించి సినిమాను జనంలోకి తీసుకెళ్లారు. ఇక ప్రొడ్యుసర్ దిల్ రాజు అయితే ఏకంగా డ్యాన్సులు చేస్తూ, తన ఫ్యామిలీతో ఇంటర్వ్యూలు ఇస్తూ.. భార్య, కుమారిడితో కలిసి టీవీ ప్రోగ్రాముల్లో పాల్గొంటూ బాగానే కష్టపడ్డారు. తాజాగా ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 5)న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి విజయ్, పరశురాం తమ పాత మ్యాజిక్ రిఫీట్ చేశారా సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజల టాక్ ఎలా ఉందంటే..
ఫ్యామిలీ స్టార్ (The Family Star) ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా రిలీజవ్వగా అన్ని ప్రాంతాల నుంచి మిక్స్‌డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ బావున్నాయని, కామెడీ వర్కౌట్ అయిందని అంటున్నారు. విజయ్, పరశురాం తమ సక్సెస్ కాంబోను మరోసారి నిరూపించారని.. హిట్ గ్యారంటీ అని ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్నారు. ఫస్టాప్ మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రజెన్స్ బావుందని.. సెకండాఫ్ సెంటిమెంట్ సన్నివేశాలు అదిరిపోయాయని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుత మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్‌ను ఫన్నీ వేలో సూపర్‌గా చూయించారని, విజయ్ మృణాల్ (Mrunal Thakur) జంట సూపర్‌గా ఉందంటున్నారు.
ఇదిలాఉండగా.. సినిమాపై పాజిటివ్ టాక్ ఎలా వస్తుందో నెగిటివ్ టాక్ కూడా అలానే వస్తోంది. ఎప్పటిలానే సినిమా రిలీజ్‌కు ముందే విజయ్ (VijayDeverakonda) మీద ప్రారంభమైన నెగిటివ్ టాక్.. సినిమా రిలీజ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతోంది. ఫ్యామిలీ స్టార్ (The Family Star) చిత్రం సీరియల్‌గా ఉందని.. ఏ మాత్రం కొత్తదనం లేదని, రొటీన్ కథతోనే సినిమా లాగించారని, గీతా గోవిందం ఫార్మూలానే ఇక్కడా వాడారని, కామెడీ అంతటా వర్కౌట్ అవలేదని,, అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు, రిపీటెడ్ సీన్స్ ఉన్నాయంటూ ట్వీట్లు పెడుతున్నారు.
ఇంకొంతమంది.. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోని సినిమాకు వెళ్లొద్దని నార్మల్‌గా ఫీస్‌ఫుల్ మైండ్‌తో చూస్తే అందరికీ నచ్చుతుందని కామెంట్ చేస్తున్నారు. అయితే లాంగ్ వీకెండ్, ఉగాది పండుగ, వేసవి సెలవులు సినిమాకు బాగా కలిసి రానుండడంతో సినిమా తప్పకుండా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని అనుకుంటున్నారు. చూడాలి మరి సినిమా ఏ మేర కలెక్షన్లు రాబట్టి విజయం సాధిస్తుందో..