మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vidya Vasula Aham: ‘విద్య వాసుల అహం’ వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌కు డేట్ ఫిక్స్

ABN, Publish Date - May 12 , 2024 | 08:45 PM

‘అహం’తో కూడిన ప్రేమ‌క‌థ‌లోని భావోద్వేగాల‌ను, ఇగోల‌ను చూపించ‌డానికి రెడీ అవుతున్నారు విద్య‌, వాసు. మే 17న వీరి ఇగో ప్రేమ‌క‌థ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదిక‌ కానుంది. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో తన్విక, జశ్విక క్రియేషన్స్‌పై మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మాతలుగా ఈ సినిమా రాబోతుంది. మణికాంత్ గెల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

Vidya Vasula Aham Movie Still

‘అహం’తో కూడిన ప్రేమ‌క‌థ‌లోని భావోద్వేగాల‌ను, ఇగోల‌ను చూపించ‌డానికి రెడీ అవుతున్నారు విద్య‌, వాసు. మే 17న వీరి ఇగో ప్రేమ‌క‌థ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదిక‌ కానుంది. వీళ్ల క‌థ‌ని టూకీగా చెప్పాలంటే రాహుల్ విజయ్ (Rahul Vijay) పేరు వాసు, శివాని (Shivani Rajasekhar) పేరు విద్య. అసలు పెళ్ళంటే ఇష్టం లేని వాసు, విద్యని పెళ్లి చేసుకోవలిసి వస్తుంది, కపుల్ అన్నాక ఒకరు తగ్గాలి ఇంకొకరు నెగ్గాలి, కాని ఇద్దరూ నేనే నెగ్గాలి అని అనుకుంటే, అదే ఇగోకి పోతే, ఆ పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది? అనే నేపధ్యలో ఈ కథ నడుస్తుంది. మరీ విద్య వాసులు ఇగోతోనే ఉంటారా? లేదా పెళ్ళైన కొత్తలో ఉండే మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తారా? అనేది తెలియాలంటే ఆహా ఓటీటీలో మే 17 వ‌రల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్ అయ్యే ‘విద్య వాసుల అహం’ (Vidya Vasula Aham) కోసం వేచి చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.

*Vote: టాలీవుడ్ అగ్ర న‌టులు.. ఓటు ఎక్క‌డ వేయ‌నున్నారంటే!


ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో తన్విక, జశ్విక క్రియేషన్స్‌పై మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మాతలుగా ఈ సినిమా రాబోతుంది. మణికాంత్ గెల్లి (Manikant Gelli) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. క్యారెక్టర్స మెచ్యుర్డ్‌గా ఆలోచించినప్పటికీ వారిద్దరి మధ్యలో ఈగో అనే వాల్‌ని బ్రేక్ చేయనంత వరకు వారి దాంపత్య జీవితంలోకి వెళ్ళలేరు అనే పాయింట్‌ని తీసుకుని సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి, రాజశ్రీనాయర్, వైవ రాఘవ తదితరులు ఇతర పాత్రలలో నటించారు. (Vidya Vasula Aham Ready to Premiere in Aha)

Read Latest Cinema News

Updated Date - May 12 , 2024 | 08:45 PM