Prabhutva Junior Kalasala OTT: రెండు ఓటీటీలలో.. చిన్న సినిమా ప్రభంజనం

ABN, Publish Date - Aug 29 , 2024 | 05:34 PM

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’. ఓక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాని నిర్మించారు. జూన్ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు రెండు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆహాలో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.

Prabhutva Junior Kalasala Movie Poster

ప్రణవ్ ప్రీతమ్ (Pranav Preetham), షాజ్ఞ శ్రీ వేణున్ (Shagnasri Venun) జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’ (Prabhutva Junior Kalasala Punganuru 500143). ఓక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం (Sreenath Pulakuram) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాని నిర్మించారు. జూన్ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ మనసును దోచుకుని, మంచి స్పందనను రాబట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ లవర్స్‌ను మెప్పించేందుకు వచ్చేసింది. ఆల్రెడీ ఆహా (Aha)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వచ్చే శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime)లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండబోతోంది.

Also Read- Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ

అంతా కొత్త వారితో చేసిన ఈ చిన్న చిత్రం థియేటర్లలో మంచి స్పందనను రాబట్టుకుని.. ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకోవడం విశేషం. ఆహాలో ఈ మూవీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఆహాతో పాటుగా యూఎస్ ఆడియెన్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. థియేటర్లలో యూత్‌ని ఆకర్షించిన మా సినిమా ఇప్పుడు ‘ఆహా’లో ఫ్యామిలీ ప్రేక్షకుల ప్రసంశలు పొందుతోంది. ఓటీటీలో విడుదల అయిన తర్వాత చాలా మంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది. మరో వారం తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ కానుందీ సినిమా. తద్వారా ఎక్కువ మంది ఆడియన్స్‌కు ఈ సినిమా రీచ్ అవుతుందని భావిస్తున్నామని అన్నారు. (Prabhutva Junior Kalasala OTT)


ప్రతీ మనిషికి తొలిప్రేమ ఎంతో మధురంగా, గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన తొలి ప్రేమను ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రంలో దర్శకుడు చూపించారు. ఇంటర్మీడియట్ రోజులు.. తొలిప్రేమ.. విరహ వేదనలు.. ఇలా అన్ని అంశాలతో కుర్రకారుని కట్టి పడేసేలా ఓ అందమైన ప్రేమ కావ్యాన్ని ఎంతో హృద్యంగా దర్శకుడు తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ ప్రేమ కథా చిత్రానికి ఓటీటీ ఆడియెన్స్ సైతం ఫిదా అవుతున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 29 , 2024 | 05:34 PM