మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Varun Tej: మా నాన్నని చూస్తే నాకే భయం వేసింది

ABN, Publish Date - Jun 13 , 2024 | 06:15 PM

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. బ్యానర్‌పై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు ప్రధాన పాత్రలలో నటించగా.. పవన్ సాధినేని షో రన్నర్‌గా రాబోతోన్న ఈ ZEE5 ఒరిజినల్ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

Paruvu Pre Launch Event

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. (Gold Box Entertainments) బ్యానర్‌పై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘పరువు’ (Paruvu). సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు ప్రధాన పాత్రలలో నటించగా.. పవన్ సాధినేని (Pavan Sadineni) షో రన్నర్‌గా రాబోతోన్న ఈ ZEE5 ఒరిజినల్ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ‘పరువు’ ప్రీ లాంచ్ ఈవెంట్‌ను (Paruvu Pre Launch Event) తాజాగా మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్‌ను అందరికీ చూపించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..

Also Read- Mega vs Allu: మరోసారి రివీలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం

ముఖ్య అతిథిగా హాజరైన వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) మాట్లాడుతూ.. ‘పరువు’ పైలెట్ ఎపిసోడ్ బాగుంది. ఈ రాత్రి నుంచే (గురువారం అర్థరాత్రి తెల్లవారితే శుక్రవారం) ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. మా ఇంట్లో అందరం కలిసి ఫస్ట్ ఎపిసోడ్ చూశాం. థియేటర్ అయినా, ఓటీటీ అయినా కూడా ఆడియెన్స్ మంచి కాన్సెప్ట్‌లతో వస్తే ఆదరిస్తుంటారు. నేషనల్ వైడ్‌గా అందరినీ ఆకట్టుకునేలా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. ఫస్ట్ ఎపిసోడ్ చూసినంత సేపు టైం తెలియలేదు. అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంది. విప్లవ్ ఎడిటింగ్, మ్యూజిక్, కెమెరా వర్క్ అదిరిపోయింది. సిరీస్ అంతా కూడా ఎంతో సహజంగా కనిపించింది. షో రైటర్, డైరెక్టర్లకు కంగ్రాట్స్. 30 నిమిషాల కంటెంట్ చూసినా కూడా ఆ ఇద్దరికీ ఎంతో భవిష్యత్తు ఉందని అర్థమైంది. షో రన్నర్ పవన్ సాధినేని అద్భుతమైన దర్శకులు. పవన్‌కు కంగ్రాట్స్. ఏ ఒక్కరు కూడా కొత్త యాక్టర్‌గా అనిపించలేదు. నరేష్ అగస్త్య అద్భుతంగా నటించారు. ఆయన విలక్షణ నటుడు. నివేదా ఎప్పుడూ డిఫరెంట్ పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్నారు. మా నాన్నని ఈ పోస్టర్లో చూస్తే నాకే భయం వేసింది. నేను మా హనీ అక్క కోసం ఇక్కడికి వచ్చాను. అక్క ఎప్పుడూ మా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుని అవకాశాలు అడగలేదు. తన కెరీర్‌ని తనే సొంతంగా బిల్డ్ చేసుకుంటోంది. మా అక్కని చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుంది. ఈ సిరీస్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.


సుష్మిత కొణిదెల మాట్లాడుతూ.. ‘‘మా ప్రతీ ప్రాజెక్ట్‌కు మీడియా ఎంతో సహకరిస్తోంది. జీ5 టీం మాకు ఎంతో అండగా నిలబడుతోంది. ‘పరువు’ ప్రాజెక్ట్‌కు జీ5 టీం ఎంతో సహకరించింది. ఇది చాలా సున్నితమైన అంశం. సమాజంలో ఇంకా ఈ అంశం గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. పరువు హత్యల వల్ల బాధపడుతున్న వారి గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే సిద్దార్థ్, రాజ్ అద్భుతంగా ఈ స్క్రిప్ట్ రాశారు. ఎన్నో లేయర్స్, ఎన్నో కారెక్టర్లతో పరువు స్క్రిప్ట్‌ను అద్భుతంగా రాశారు. ప్రతీ ఎపిసోడ్‌కు ఇంట్రెస్ట్‌ పెరుగుతూనే ఉంది. పవన్ సాధినేని షో రన్నర్ మాత్రమే కాదు క్రైసిస్ మేనేజర్‌గానూ వ్యవహరించారు. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చేది కాదు. అందరూ ప్రాణం పెట్టి నటించారు. ఇందులో ఒక్కోసారి మా నాగబాబు (Nagababu) బాబాయ్ పెర్ఫార్మెన్స్ చూసి భయం వేసింది. నాకోసం ఈవెంట్‌కు వచ్చిన వరుణ్ తేజ్‌కు థాంక్స్. జీ5లో మా ‘పరువు’ని నేటి రాత్రి నుంచి వీక్షించండి’’ అని అన్నారు.

జీ5 వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ దేశ్రాయ్ మాట్లాడుతూ.. ‘‘సిద్దార్థ్, రాజ్‌లు అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. సుష్మిత మంచి సపోర్ట్ ఇచ్చారు. నరేష్ అగస్త్యతో ఇంకో వెబ్ సిరీస్‌ను కూడా స్టార్ట్ చేశాం. నరేష్ అద్భుతంగా నటించారు. నివేదా పర్ఫామెన్స్‌ గురించి అందరూ మాట్లాడుకుంటారు. మేం ఈ వెబ్ సిరీస్ పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నాం. షో రన్నర్‌గా పవన్ సాధినేని వచ్చాక మరో లెవెల్‌కు వెళ్లింది. శ్రవణ్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. జీ5లో మా ‘పరువు’ని చూడండి’’ అని తెలిపారు. ఇంకా ఈ వెబ్ సిరీస్‌లో భాగమైన పలువురు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

Read Latest Cinema News

Updated Date - Jun 13 , 2024 | 06:15 PM