Nivetha Pethuraj: కారు డిక్కీ ఓపెన్ చేయ‌మ‌న్నందుకు.. పోలీసుల‌కు దాస్ బ్యూటీ ధ‌మ్కీ

ABN , Publish Date - May 30 , 2024 | 11:49 AM

అలా వైకుంఠాపురం, దాస్ కా ధ‌మ్కీ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న న‌టి నివేథా పేతురాజ్. తాజాగా ఈ అమ్మ‌డి ఓ వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. అందులోలో నివేథా కారు డ్రైవింగ్ చేస్తున్న స‌మ‌యంలో పోలీసుల‌తో వాగ్వాదం చోటు చేసుకోవ‌డం క‌నిపించింది.

Nivetha Pethuraj: కారు డిక్కీ ఓపెన్ చేయ‌మ‌న్నందుకు.. పోలీసుల‌కు దాస్ బ్యూటీ ధ‌మ్కీ
Nivetha Pethuraj

అలా వైకుంఠాపురం, దాస్ కా ధ‌మ్కీ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న న‌టి నివేథా పేతురాజ్ (Nivetha Pethuraj). అందం, అభిన‌యం అన్నీ ఉన్నా సినిమా అవ‌కాశాలు అంత‌గా లేని ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్‌ల‌లో కూడా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో ఏ సినిమాలో న‌టించ‌కున్నా తాజాగా ఈ అమ్మ‌డికి చెందిన ఓ వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో నివేథా కారు డ్రైవింగ్ చేస్తున్న స‌మ‌యంలో పోలీసుల‌తో వాగ్వాదం చోటు చేసుకోవ‌డం క‌నిపించింది.

ఏ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిందో కానీ నివేథా కారును న‌డుపుకుంటూ వెళుతుండ‌గా మ‌ధ్య‌లో పోలీసులు ఆపి కారు వెన‌కాల‌ డిక్కీని తెర‌వాలంటూ కోరగా నివేథా (Nivetha Pethuraj) అంగీక‌రించ‌లేదు. అది నా ప‌ర్స‌న‌ల్ అని అందులో మీకు చెప్ప‌లేనివి ఉన్నాయ‌ని, అది నా పరువుకు సంబంధించిన మ్యాటర్ అని తెలిపింది. ఈ క్రమంలో అక్క‌డే ఉండి ఈ దృశ్యాన్నంతా ఓ పొలీస్‌ వీడియో తీస్తుండ‌గా అత‌నిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.


ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అయితే.. నివేథా పేతురాజ్ (Nivetha Pethuraj) ఇది కావాల‌ని చేస్తోంద‌ని, ఏదో సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఇలా చేస్తోందంటూ నెటిజ‌న్లు మండి ప‌డుతున్నారు. పైగా అయితే పోలీసులు షూ వేసుకోకుండా ఖ‌రీదైన క్రాక్స్ చెప్పులు వేసుకుని ఉండ‌డం, వారు మాట్లాడే విధానం అంతా సినిమా స్టైల్‌లోనే ఉండ‌డంతో అంద‌రికీ ఈ వీడియోపై డౌటనుమానాలు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో అస‌లు వాస్త‌వ‌మేంటో తెలియాల్సి ఉంది.

Updated Date - May 30 , 2024 | 02:48 PM