Bhaje Vayu Vegam OTT: సూప‌ర్ ఫాస్ట్‌గా ఓటీటీకి వ‌చ్చేసిన ..లేటెస్ట్ తెలుగు యాక్ష‌న్, క్రైమ్ థ్రిల్ల‌ర్

ABN, Publish Date - Jun 28 , 2024 | 09:21 AM

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన టాలీవుడ్ యాక్ష‌న్, క్రైమ్ థ్రిల్ల‌ర్ భజే వాయు వేగం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. కార్తికేయ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించ‌గా హ్యాపీడేస్ రాహుల్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

Bhaje Vaayu Vegam

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన టాలీవుడ్ యాక్ష‌న్, క్రైమ్ థ్రిల్ల‌ర్ భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా, ఐశ్వర్య మీనన్ (Ishwarya Menon) హీరోయిన్‌గా నటించ‌గా హ్యాపీడేస్ రాహుల్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ (UV Concepts) బ్యానర్ నిర్మించిన ఈ మూవినీ కొత్త డైరెక్ట‌ర్ ప్రశాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం చేశారు.

మే 31న థియేటర్లలోకి వ‌చ్చిన ఈ చిత్రం మొద‌టి రోజు మొద‌టి ఆట‌ నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. ఆస్ప‌త్రిలో చావుబ‌తుకుల మ‌ధ్య ఉన్న తండ్రిని ర‌క్షించుకునేందుకు డ‌బ్బు కోసం వెంక‌ట్‌ క్రికెట్ బెట్టింగ్ చేస్తాడు. అయితే గెలిచిన‌ డ‌బ్బును డేవిడ్ గ్యాంగ్ ఇవ్వ‌కుండా ఎగ్గోడ‌తారు. దీంతో ఓ హోట‌ల్‌లో పార్క్ చేసి ఉన్న ఖ‌రీదైన డేవిడ్‌ కారును దొంగ‌త‌నం చేస్తారు. అయితే అందులో అప్ప‌టికే ఓ వ్య‌క్తి శ‌వం, హావాలా డ‌బ్బుకు సంబంధించిన‌ నోటు ఉంటుంది. దీంతో డేవిడ్ గ్యాంగ్ అన్న‌ద‌మ్ముల వెంట ప‌డుతుంటారు.


ఈ క్ర‌మంలో వెంక‌ట్‌కు ఓక్కో ర‌హాస్యం తెలుస్తూ వ‌స్తుంది. చివ‌ర‌కు కారు ఏమైంది, హ‌వాలా డ‌బ్బు దొరికిందా, ఆ కారులో ఉన్న వ్య‌క్తిని ఎవ‌రు చంపారు, చివ‌రికి ఏమైంద‌నే ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్‌ క‌థతో ప్రేక్ష‌కుల‌కు అదిరిపోయే థ్రిల్‌ను అందిస్తారు. సినిమా ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా స్పీడ్ స్క్రీన్‌ప్లేతో ప‌రుగెత్తుతుంది.

ఇప్పుడీ సినిమా ప్ర‌ముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. సినిమా ల‌వ‌ర్స్‌కు ఈ మూవీ ఈ వీకెండ్‌ సూప‌ర్‌గా ఉంటుంది, ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య సీన్లు కూడా లేనందున ఫ్యామిలీ అంతా క‌లిసి భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam) సినిమాను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. డోంట్ మిస్‌.

Updated Date - Jun 28 , 2024 | 09:30 AM