మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gangs Of Godavari OTT: డేట్ ఫిక్సయింది.. లంకల రత్నం జాతర ఇక ఓటీటీలో!

ABN, Publish Date - Jun 09 , 2024 | 02:09 PM

మాస్ కా దాస్ విష్వక్‌ సేన్‌ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 31న విడుదలైన ఈ చిత్రాన్ని అతి తక్కువ కాలంలోనే ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

Gangs Of Godavari Movie Still

మాస్ కా దాస్ విష్వక్‌ సేన్‌ (Mass ka Das Vishwak Sen) హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 31న విడుదలైన ఈ చిత్రాన్ని అతి తక్కువ కాలంలోనే ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఉన్న మ్యాటర్ ప్రకారం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ జూన్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ (NetFlix) స్ట్రీమింగ్ కానుంది. ఈ పోస్టర్‌లో ‘చరిత్రలో మిగిలిపోవడానికి లంకల రత్నం వస్తున్నాడు’ అనే క్యాప్షన్ హైలెట్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో అందుబాటులోకి రానుంది.

Also Read- Gangs Of Godavari Movie Review: విశ్వక్ సేన్ గోదావరి నేపథ్యంలో చేసిన సినిమా ఎలా ఉందంటే... 


‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కథ (Gangs Of Godavari Story) విషయానికి వస్తే.. గోదావరి దగ్గర లంకలో లంకల రత్నం లేదా రత్న (విశ్వక్ సేన్) ఒక గ్యాంగ్‌ని వేసుకొని రౌడీలా తిరుగుతూ కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. అతను ఇంకా ఎదగాలి అనుకుంటాడు, అందుకని లోకల్ ఎంఎల్ఏ రుద్రరాజు (గోపరాజు రమణ) దగ్గర చేరి అతనికి దగ్గరవుతాడు. రుద్రరాజుకి వ్యతిరేకంగా వుండే ఇంకో రాజకీయ నాయకుడు నానాజీ (నాసర్) తో చేతులు కలిపి రుద్రరాజుపై ఎంఎల్ఏ గా పోటీ చేసి గెలుస్తాడు రత్న. నానాజీ కూతురు బుజ్జి (నేహా శెట్టి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు రత్న. ఒక తగాదాలో నానాజీని కొడతాడు రత్న, ఆ దెబ్బకి నానాజీ చనిపోతాడు. ఈలోగా ఎంఎల్ఏగా ఓడిపోయిన రుద్రరాజు, రత్నపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. రత్నని ఎంఎల్ఏ గా ఓడగొడతాడు, రత్న ఇంటిపైకి రాళ్లు వేసి భార్యని భయపెడతాడు. భార్య జోలికి వస్తే రత్న ఇక రాజీ పడదాం అని అపొజిషన్ వాళ్ళకి కబురు పెడతాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రత్న తనపై గెలిచిన ఎంఎల్ఏ ని చంపేస్తాడు. రాజీకి రమ్మని చెప్పి ఎంఎల్‌ఏ ని చంపేయడం రత్న మనుషులకు నచ్చదు. వాళ్ళు రత్నకి ఎదురు తిరుగుతారు. తరువాత ఏమైంది? రత్నపై ప్రతీకారం తీర్చుకున్నారా? అదే ఊర్లో ఉన్న రత్నమ్మ (అంజలి).. రత్నకి ఎందుకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటుంది? కత్తి కట్టడం అంటే ఏంటి? వంటి వాటికి సమాధానమే ఈ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా. (Gangs Of Godavari OTT Release Date)

Read Latest Cinema News

Read more!
Updated Date - Jun 09 , 2024 | 02:40 PM