SIT: రిలీజై 50 రోజులు పూర్తయినా.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న అరవింద్ కృష్ణ SIT..

ABN, Publish Date - Jun 26 , 2024 | 10:04 PM

తను పోషించే ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ.. వెండితెరపై బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్న నటులలో అరవింద్ కృష్ణ ఒకరు. నటుడిగా తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న అరవింద్ కృష్ణ నటించిన చిత్రం S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో ప్రసారమవుతూ టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

Arvind Krishna

తను పోషించే ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ.. వెండితెరపై బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్న నటులలో అరవింద్ కృష్ణ ఒకరు. నటుడిగా తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న అరవింద్ కృష్ణ (Arvind Krishna) నటించిన చిత్రం S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం Special Investigation Team). ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీ (Zee5 OTT)లో ప్రసారమవుతూ టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా ఓటీటీలో విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా అదే స్పందనను రాబట్టుకోవడం.

Also Read-Kalki 2898AD Review: మహాభారత యుద్ధం తరువాత ఏమి జరిగిందో ఊహాత్మకంగా...


అలాగే ఈ సినిమా ZEE5లో స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటి నుండి.. ప్రతి వారం టాప్ ట్రెండ్స్‌లో ఉండటం విశేషం. అదే కంటిన్యూ చేస్తూ 8వ వారంలోనూ టాప్ ట్రెండ్స్‌లో ఉన్న ఈ సినిమా.. కంటెంట్ కింగ్ అని మరోసారి నిరూపించుకుంది. సిట్‌ మూవీలో అరవింద్ కృష్ణ అసాధారణ నటనా ప్రదర్శన కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన రాబోయే చిత్రం ‘ఏ మాస్టర్‌పీస్‌’ (A Masterpiece)లో సూపర్‌హీరో పాత్రలో మెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో అరవింద్ కృష్ణ సూపర్ హీరో లుక్ (Super Hero Look) అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘ఏ మాస్టర్‌పీస్‌’లో సూపర్ హీరోగా స్టైలిష్ గెటప్‌లో అరవింద్ కృష్ణ మెప్పిస్తున్నారు. అంతేకాదు, ఇందులో కొన్ని ఉత్కంఠభరితమైన విన్యాసాలు చేసినట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అరవింద్ కృష్ణ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Read Latest Cinema News

Updated Date - Jun 26 , 2024 | 10:04 PM