SiT: మాస్ కా దాస్ వదిలిన ‘సిట్’ ట్రైలర్
ABN , Publish Date - May 09 , 2024 | 10:30 PM
హీరోగా పలు సినిమాలతో అలరించిన అరవింద్ కృష్ణ మరియు రజత్ రాఘవ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ ‘SIT’(సిట్ - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)అనే చిత్రంతో రాబోతున్నారు. SNR ఎంటర్‌టైన్‌మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్లపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నిర నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు.
హీరోగా పలు సినిమాలతో అలరించిన అరవింద్ కృష్ణ మరియు రజత్ రాఘవ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ ‘SIT’(సిట్ - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)అనే చిత్రంతో రాబోతున్నారు. SNR ఎంటర్‌టైన్‌మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్లపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నిర నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. VBR (విజయ్ భాస్కర్ రెడ్డి) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు. ట్రైలర్ చూసిన అనంతరం.. చాలా ఆసక్తికరంగా ఉందని మూవీ యూనిట్‌ని విశ్వక్ సేన్ అభినందించారు.
*రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్
‘సిట్’ ట్రైలర్ విషయానికి వస్తే... మొదట ఓ అమ్మాయి మర్డర్ కేసు నుంచి ఓపెన్ అయ్యి ఆ తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగింది. ఒక అమ్మాయిని అత్యాచారం చేసి మర్డర్ చేస్తే ఆ కేసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దగ్గరికి వస్తే అరవింద్ కృష్ణ ఎలా డీల్ చేశాడు అనే సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో We Take The Words Duty, Honour and Compassion అని తమ జాబ్ గురించి నిజాయితీ నిబద్దత కలిగిన పోలీసాఫీసర్‌గా అరవింద్ కృష్ణ చెప్పడం హైలెట్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ప్రేక్షకులకు ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇవ్వబోతున్నట్లుగా అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
‘సిట్’ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తుండగా.. రజత్ రాఘవ్ కీలక పాత్రని పోషిస్తున్నారు. నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల వంటివారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. బాలిరెడ్డి, రమేష్ గుండా, వాసిరెడ్డి నరేంద్ర సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వరికుప్పల యాదగిరి మ్యూజిక్ అందిస్తుండగా.. జగదీశ్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రాఫర్‌గా, కిరణ్ తుంపెర ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మే 10 నుంచి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
Read Latest Cinema News