Suresh Productions: అరవై ఏళ్ల అద్భుత సినీ ప్రయాణం
ABN, Publish Date - May 21 , 2024 | 07:08 PM
పద్మ భూషణ్, మూవీ మొఘల్, లెజెండరీ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు స్థాపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అరవై ఏళ్ల అద్భుత సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకొని వైభవోత్సవాలు జరుపుకుంటోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా ప్రేక్షకుల మన్ననలని పొందిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 60 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో శతాధిక చిత్రాలను ప్రేక్షకులకందించి చరిత్ర సృష్టించింది.
పద్మ భూషణ్, మూవీ మొఘల్, లెజెండరీ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (Daggubati Ramanaidu) స్థాపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) అరవై ఏళ్ల అద్భుత సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకొని వైభవోత్సవాలు జరుపుకుంటోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా ప్రేక్షకుల మన్ననలని పొందిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 60 (Suresh Productions At 60) సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో శతాధిక చిత్రాలను ప్రేక్షకులకందించి చరిత్ర సృష్టించింది. ఎన్నో అద్భుతమైన చిత్రాలని నిర్మించి ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించిన సంస్థగా అరుదైన ఘనత సాధించింది.
*Hema: రేవ్ పార్టీ కవరింగ్ కోసం రెసిపీ.. హేమతో ఆడేసుకుంటోన్న నెటిజన్లు
1964లో ప్రారంభమైన ఈ సంస్థ.. ఎన్నో కల్ట్ క్లాసిక్ హిట్స్, మోడరన్ మాస్టర్ పీస్ మూవీస్‌తో గత ఆరు దశాబ్దాలుగా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ పంచుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ 60 ఏళ్ళు పూర్తి చేసుకుని వైభవోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ అద్భుతమైన సినీ ప్రయాణంలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రేక్షకులకు, అభిమానులకు, మీడియాకు, ప్రతి ఒక్కరికీ నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది. (Suresh Productions Banner)
Read Latest Cinema News