మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RK Sagar: పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం

ABN, Publish Date - May 07 , 2024 | 08:02 PM

బుల్లితెరపై ఆర్కే సాగర్‌కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘మొగలి రేకులు’ సీరియల్‌తో స్మాల్ స్క్రీన్ మీద స్టార్ హీరోగా మారిపోయారు. సినిమాలతోనూ తన అభిమానుల్ని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ది 100’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఒక వైపు సినిమా ప్రమోషన్స్ చేస్తూనే.. మరోవైపు తన అభిమాన హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన డ్యూటీని నెరవేరుస్తున్నారు.

Pithapuram Election Campaign

బుల్లితెరపై ఆర్కే సాగర్‌ (RK Sagar)కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘మొగలి రేకులు’ (Mogali Rekulu) సీరియల్‌తో స్మాల్ స్క్రీన్ మీద స్టార్ హీరోగా మారిపోయారు. సినిమాలతోనూ తన అభిమానుల్ని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ది 100’ (The 100) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఒక వైపు సినిమా ప్రమోషన్స్ చేస్తూనే.. మరోవైపు తన అభిమాన హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇచ్చిన డ్యూటీని నెరవేరుస్తున్నారు. ఆర్కే సాగర్‌‌కు అధికారికంగా పవన్ కళ్యాణ్ కొన్ని రాజకీయ బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే. తన అధినేత చెప్పిన రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో ఆర్కే సాగర్‌ చురుగ్గా పాల్గొంటున్నారు. (RK Sagar Campaign at Pithapuram)

*AP Elections - Pawan Kalyan: సినీరంగం నుంచి ఒక్కొక్కరు బయటికొస్తున్నారు


పవన్ కళ్యాణ్ పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తరుపున ఇప్పటికే సెలెబ్రిటీలు పిఠాపురంలో ప్రచారం చేశారు, చేస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ సైతం తన వంతుగా ప్రచారాన్ని చేపట్టారు. నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)తో కలిసి సాగర్ చేసిన ఈ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్‌ని గెలిపించండి’ అని సాగర్ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. రీసెంట్‌గానే మెగా మదర్ అంజనమ్మ (Mega Mother Anjanamma) చేతుల మీదుగా ఆర్కే సాగర్‌ నటించిన ‘ది 100’ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

Read Latest Cinema News

Updated Date - May 07 , 2024 | 08:02 PM