మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: బొకేలు.. శాలువాలు వద్దు.. అందరినీ కలుస్తా..

ABN, Publish Date - Jun 13 , 2024 | 07:41 PM

తనని పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిపించిన వారికి, గెలిచిన తర్వాత.. అలాగే ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి అభినందనలు చెబుతున్న వారందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. అభినందనలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని పవన్ కళ్యాణ్ ఇందులో విజ్ఞప్తి చేశారు.

Janasena Chief Pawan Kalyan

తనని పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం నుంచి గెలిపించిన వారికి, గెలిచిన తర్వాత.. అలాగే ఏపీ మంత్రిగా (AP Minister) ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి అభినందనలు చెబుతున్న వారందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. తనకు అభినందనలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇందులో విజ్ఞప్తి చేశారు. అసలు పవన్ కళ్యాణ్ విడుదల చేసిన లేఖలో ఏముందంటే..

Also Read- Mega vs Allu: మరోసారి రివీలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం


‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నలుచెరగుల నుంచీ అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలో ఉన్నవారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు అందిస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. (Pawan Kalyan Message)

బొకేలు.. శాలువాలు వద్దు

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు. త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర కార్యాలయం ద్వారా తెలియజేస్తాము. అభినందనలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.

20వ తేదీ తర్వాత పిఠాపురం పర్యటన

ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అదే విధంగా శాసన సభ సమావేశాలు కూడా త్వరలోనే ఉంటాయి. వీటిని పూర్తి చేసుకొని.. నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ (Pithapuram Assembly Constituency) ప్రజలను కలుస్తాను. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుస్తాను. ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను..’’ అని పవన్ కళ్యాణ్ ఈ లేఖలో పేర్కొన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 13 , 2024 | 07:45 PM