Murali Mohan: తన పర్సనల్ మేకప్ మ్యాన్‌ని అభినందించిన మురళీ మోహన్

ABN, Publish Date - Aug 22 , 2024 | 09:08 PM

మురళీమోహన్ పర్సనల్ మేకప్ మ్యాన్ కొల్లి రాము అక్కగారైన పమిడి ముక్కల రాజ్యలక్ష్మి 85 ఏళ్ల వయసులో బుధవారం మృతిచెందారు. అయితే అవయవ దాన ప్రక్రియ పట్ల అవగాహన కలిగిన కొల్లి రాము ‘‘చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్’ వారికి విషయం తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి వచ్చి రాజ్యలక్ష్మి కళ్ళను సేకరించారు. ఈ విషయం తెలిసి మురళీమోహన్ కొల్లి బ్రదర్స్‌ని అభినందించారు.

Murali Mohan

మరణం తరువాత కూడా జీవించే గొప్ప ప్రక్రియ అవయవ దానం. అయితే ఈ అద్భుత ప్రక్రియ గురించి తెలియక పోవడంతో చాలామంది అవయవ దానానికి ముందుకు రావటం లేదు. మరణానంతరం కూడా చేసే అవయవ దానానికి వయసుతో నిమిత్తం లేదు అని చెప్పే సంఘటన ఒకటి తెలుగు చిత్ర పరిశ్రమలో చోటుచేసుకుంది. ప్రముఖ నటులు, నిర్మాత. పరిశ్రమ పెద్ద మురళీమోహన్ (Murali Mohan) పర్సనల్ మేకప్ మ్యాన్ కొల్లి రాము (Kolli Ramu) అక్కగారైన పమిడి ముక్కల రాజ్యలక్ష్మి (Pamidi Mukkala Rajyalakshmi) 85 ఏళ్ల వయసులో బుధవారం మృతిచెందారు. అయితే అవయవ దాన ప్రక్రియ పట్ల అవగాహన కలిగిన కొల్లి రాము ‘‘చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్’ (Chiranjeevi Blood and Eye Band) వారికి విషయం తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి వచ్చి రాజ్యలక్ష్మి కళ్ళను సేకరించారు. అలాగే మిగిలిన అవయవ దాన నిమిత్తం మృతదేహాన్ని అపోలో హాస్పిటల్ మెడికల్ కాలేజీకి అప్పగించారు.

Also Read- Gaddar Awards: గద్దర్ అవార్డుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు వీరే..


ఈ సందర్భంగా మురళీమోహన్ (Actor Murali Mohan) మాట్లాడుతూ.. ‘‘అక్క మరణంతో దుఃఖంలో ఉన్నప్పటికీ అవయవ దానం పట్ల అవగాహన కలిగిన కొల్లి రాము, ఆయన తమ్ముడు కొల్లి వెంకటేశ్వర రావు చేసిన ఈ మంచి పనిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అవయవ దానం చేయాలి అంటే బ్రతికి ఉన్నప్పుడే కాదు.. కుటుంబ సభ్యుల ఆమోదంతో చనిపోయిన వాళ్ల అవయవ దానం కూడా చేయవచ్చు. దానికి వయసుతో నిమిత్తం లేదు అని ఈ సంఘటన నిరూపిస్తుంది. ఇంత మంచి పని చేసి అవయవ దానం పట్ల అవగాహన కల్పించిన కొల్లి రాము, వెంకటేశ్వరరావులను అభినందిస్తున్నాను’’ అని తెలిపారు.


ఈ సందర్భంగా సమాచారం అందించిన వెంటనే స్పందించిన చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ వారికి, అపోలో మెడికల్ కాలేజీ వారికి కొల్లి రాము కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన చాలా మంది.. రాజ్య‌ల‌క్ష్మిగారు తాను చ‌నిపోయిన‌ప్ప‌టికీ నేత్ర‌దానం చేయ‌టం ద్వారా మ‌రో ఇద్ద‌రికీ చూపును అందించి ఎంద‌రికో ఆద‌ర్శ‌ప్రాయంగా మారారని అంటూ.. ఇందుకు కారణమైన కొల్లి రాము, వెంకటేశ్వరరావులను అభినందిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 22 , 2024 | 09:09 PM