CCT: సోద‌రి క‌ళ్లను దానం చేసిన ముర‌ళీ మోహ‌న్ మేక‌ప్ మ్యాన్

ABN , Publish Date - Aug 20 , 2024 | 07:08 PM

కళ్లు లేని వారికి చూపును ప్ర‌సాదించేలా నేత్ర‌దానంలో కీల‌క పాత్ర పోషించ‌ట‌మే కాదు, ప్ర‌మాదాల్లో ఉన్న వ్య‌క్తుల‌కు స‌కాలంలో ర‌క్తాన్ని అందించే సేవా కార్య‌క్ర‌మాల్లో చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ ముందుంటుందనే విషయం తెలియంది కాదు. ఇప్పుడీ సెంటర్‌కు మురళీ మోహన్ మేకప్ మ్యాన్ తన సోదరి కళ్లను దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు.

CCT and Pamidimukkala Rajyalakshmi

‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’, ‘నేత్రదానం చేయండి- మళ్లీ జీవించండి’ అనే స్లోగన్స్ ఎంతగా జనాల్లోకి వెళ్లాయో.. కొన్ని సార్లు ఈ నేత్రదానం గురించి వినిపిస్తున్న వార్తలను చూస్తుంటేనే అర్థమవుతుంటుంది. కళ్లు లేని వారికి చూపును ప్ర‌సాదించేలా నేత్ర‌దానంలో కీల‌క పాత్ర పోషించ‌ట‌మే కాదు, ప్ర‌మాదాల్లో ఉన్న వ్య‌క్తుల‌కు స‌కాలంలో ర‌క్తాన్ని అందించే సేవా కార్య‌క్ర‌మాల్లో చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ (Chiranjeevi I and Blood Center) ముందుంటుందనే విషయం తెలియంది కాదు. ఇప్పుడీ సెంటర్‌కు నటుడు మురళీ మోహన్ మేకప్ మ్యాన్ (Murali Mohan Makeup Man) తన సోదరి కళ్లను దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు. (Chiranjeevi Charitable Trust)

Also Read- Hema: సీఎం రేవంత్, పవన్  కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ కావాలి!


Eye-Donation.jpg

తెలుగు చిత్ర సీమ‌కు (Tollywood) చెందిన సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ మేక‌ప్ మ్యాన్ అయినటువంటి కొల్లి రాము (Kolli Ramu) సోద‌రి ప‌మిడి ముక్క‌ల రాజ్య‌ల‌క్ష్మి (Pamidimukkala Rajyalakshmi) మంగ‌ళ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని వారు చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్‌కి చేర‌వేయ‌గా వెంట‌నే వారు స్పందించారు. అలా రాజ్య‌ల‌క్ష్మిగారు తాను చ‌నిపోయిన‌ప్ప‌టికీ నేత్ర‌దానం చేయ‌టం ద్వారా మ‌రో ఇద్ద‌రికీ చూపును అందించి ఎంద‌రికో ఆద‌ర్శ‌ప్రాయంగా మారారు. ఈ సంద‌ర్భంగా ముర‌ళీమోహ‌న్‌‌ (Actor Murali Mohan)కు, కొల్లి రాము మరియు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ వారు ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు. (Eye Donation)

Read Latest Cinema News

Updated Date - Aug 20 , 2024 | 07:08 PM