Jani Master: ఉపాసన, రామ్ చరణ్.. నా సంతోషం 1000 రెట్లు పెరిగింది

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:45 PM

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ట్విట్టర్ వేదికగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులను కొనియాడారు. మాములుగా రామ్ చరణ్ అంటే జానీ మాస్టర్‌కు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని జానీ మాస్టర్ పలు సందర్భాల్లో వెల్లడించారు కూడా. ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భమే జానీ మాస్టర్‌కు మెగా దంపతులు కల్పించారు.

Jany Master with Mega Couple Ram Charan and Upasana

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master) ట్విట్టర్ వేదికగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), ఉపాసన (Upasana) దంపతులను కొనియాడారు. మాములుగా రామ్ చరణ్ అంటే జానీ మాస్టర్‌కు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని జానీ మాస్టర్ పలు సందర్భాల్లో వెల్లడించారు కూడా. తనకు అవసరం అన్నప్పుడు రామ్ చరణ్ (Ram Charan) ఎలా నిలబడ్డారో చెప్పి.. జీవితాంతం ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భమే జానీ మాస్టర్‌కు మెగా దంపతులు కల్పించారు. ఆ విషయాన్ని స్వయంగా జానీ మాస్టరే ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి.. ఆప్యాయంగా అన్నావదిన అంటూ తన సంతోషాన్ని తెలియజేశారు. ఇంతకీ జానీ మాస్టర్ ఏం పోస్ట్ చేశారంటే..


Ram-Charan-Jany.jpg

(Choreographer Jani Master Post)

‘‘సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు..

నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా.

అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవిగారి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న, ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది.

నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యూనియన్ టి.ఎఫ్.టి.టి.డి.ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్సురెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు.

అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది.

మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎక్స్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 03:45 PM