Ram Charan - Maheshbabu: ఇది గర్వించాల్సిన సమయం

ABN , First Publish Date - 2023-08-25T15:47:30+05:30 IST

తెలుగు హీరోలకు ఎన్నో అవార్డులు వచ్చినా, నేషనల్‌ అవార్డ్‌ దక్కే భాగ్యం లేదనుకుంటున్న తరుణంలో ఆ అవార్డును సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్‌. తెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగరాస్తూ ఇన్నేళ్ల టాలీవుడ్‌ చరిత్రలో ఉద్దండులైన నటులకు దక్కని అదృష్టం బన్నీకి దక్కింది. 69వ జాతీయ పురస్కారాలను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే!

Ram Charan - Maheshbabu: ఇది గర్వించాల్సిన సమయం

తెలుగు హీరోలకు ఎన్నో అవార్డులు వచ్చినా, నేషనల్‌ అవార్డ్‌ దక్కే భాగ్యం లేదనుకుంటున్న తరుణంలో ఆ అవార్డును సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్‌. తెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగరాస్తూ ఇన్నేళ్ల టాలీవుడ్‌ చరిత్రలో ఉద్దండులైన నటులకు దక్కని అదృష్టం బన్నీకి దక్కింది. 69వ జాతీయ పురస్కారాలను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే! తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘పుష్ప’ చిత్రంలో ఉత్తమ నటన కనబర్చినందుకు అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడి అవార్డు వరించింది. దీంతో సోషల్‌ మీడియాలో బన్నీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ రాజమౌళి ‘పుష్ప.. తగ్గేదేలే’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్‌ (NTR)అయితే ‘నువ్వు అర్హుడివి బావా.. నీకు ఈ అవార్డులు, విజయం రావాల్సిందే’ అని ట్వీట్‌ చేశాడు.

తాజాగా రామ్‌చరణ్‌ (Ram charan) కూడా బన్నీతోపాటు నేషనల్‌ అవార్డులు గెలుచుకున్న అందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఓ నోట్‌ విడుదల చేశారు. ‘‘ఇది గర్వించాల్సిన సమయం. 69వ జాతీయ పురస్కారాల్లో నాకు అత్యంత ప్రియమైన వారికి అవార్డులు దక్కడంతో ఎంతో ఆనందంగా. మనమంతా సెలబ్రేట్‌ చేసుకోవలసిన సమయమిది’’ అంటూ ఆరు అవార్డులు గెలుకుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు, విజనరీ డైరెక్టర్‌ రాజమౌళి, కీరవాణి, ప్రేమ్‌రక్షిత్‌, కింగ్‌ సాలమన్‌, కాలభైరవ, శ్రీనివాస మోహన్‌, డి.వి.వి.దానయ్యగారు అందరికీ శుభాకాంక్షలు. ఇది మరచిపోలేని జర్నీ’’ అని చరణ్‌ పేర్కొన్నారు. అలాగే తన తదుపరి చిత్ర దర్శకుడు సానా బుచ్చిబాబు, వైష్ణవ్‌ తేజ్‌లతోపాటు, పుష్ప టీమ్‌కు డబుల్‌ చీర్స్‌, నా సోదరుడు అల్లు అర్జున్‌కు, దేవిశ్రీ ప్రసాద్‌కు, అలాగే డియరెస్ట్‌ కోస్టార్‌ అలియాభట్‌ జాతీయ పురస్కారాలకు ఎంపికై దేశం గర్వించేలా చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’’ అని నోట్‌లో పేర్కొన్నారు.

మహేశ్‌బాబు ట్వీట్‌...

నేషనల్‌ అవార్డు గెలుచుకున్న అందరినీ మహేశ్‌ బాబు అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అవార్డు పొందిన ప్రతి ఒక్కరూ అర్హులే. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని అన్నారు.

Updated Date - 2023-08-25T15:47:30+05:30 IST