Tollywood: దేవుళ్లపై సినిమాలు.. కోట్ల వర్షం.. ప్రస్తుత ట్రెండ్ ఇదే?

ABN, Publish Date - Jul 18 , 2024 | 04:11 PM

ఈ మధ్య మళ్లీ సినీ ఇండస్ట్రీలో దేవుళ్ల, పురాణాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు దేవుళ్ల మీద, పురాణాలపై సినిమాలు తీస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టే అన్నట్లుగా బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురుస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల మీద సినిమాలు తీశారు.. ఎంతో పేరు ప్రతిష్టలు గడించారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఈ తరహా చిత్రాలపై ఇంట్రెస్ట్ పెడుతుండటంతో మేకర్స్ వాటిపై దృష్టి పెట్టి సక్సెస్ కొడుతున్నారు.

Tollywood Trending Movies

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా.. హీరోలను అభిమానించే అభిమానులకు ఆ హీరోలు దేవుళ్లతో సమానం. అందరూ కాకపోయినా.. కొందరు మాత్రం అభిమానించే హీరోలని అలాగే భావిస్తుంటారు. అలాగే హీరోలు కూడా వారి అభిమానులను, ప్రేక్షకులను దేవుళ్లుగానే చూస్తుంటారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో దేవుడిపై వచ్చే సినిమాలకు చాలా ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది. ఆ దేవుడిపై వచ్చే సినిమాలలో తమకు నచ్చిన హీరోలు నటిస్తే.. నిజంగా గుడి ఒక్కటే తక్కువ అన్నట్లుగా అభిమానం ప్రదర్శిస్తుంటారు అభిమానులు. ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి.. దేవుడి పాత్రలు అనగానే గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు.

ఆయన పేరును ప్రస్తావించకుండా దేవుడి పాత్రల గురించి, ఆయా సినిమాల గురించి మాట్లాడుకోవడం అంటే గుడిలో దేవుడి విగ్రహం లేకుండా పూజించడమే అవుతుంది. సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆరాధ్య దైవం అన్నట్లుగా నందమూరి తారక రామారావు (NTR) పేరును పొందారు. దేవుళ్ల పాత్రలలో చాలా మంది నటులు నటించినా.. మొదట గుర్తు చేసుకునే, గుర్తొచ్చే పేరు మాత్రం ఎన్టీఆర్‌దే. ఇక విషయంలోకి వస్తే..

ఈ మధ్య మళ్లీ సినీ ఇండస్ట్రీలో దేవుళ్ల, పురాణాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు దేవుళ్ల మీద, పురాణాలపై సినిమాలు తీస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టే అన్నట్లుగా బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురుస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల మీద సినిమాలు తీశారు.. ఎంతో పేరు ప్రతిష్టలు గడించారు. ప్రస్తుతం ప్రేక్షకులు సోషియో ఫాంటసీ చిత్రాలను సక్సెస్ చేస్తుండటంతో.. మరోసారి ఆ జానర్ చిత్రాలకు గిరాకీ పెరిగింది. దేవుడిని, దేవుడి పాత్రలలో హీరోని తెరపై అలా ఒక్కసారి చూపించినా కూడా సినిమాకు కలెక్షన్లు మోతమోగిపోతోన్నాయి.

నిఖిల్ ‘కార్తికేయ2’ (Karthikeya 2)ని తీసుకున్నా, బాలయ్య ‘అఖండ’ (Akhanda)ని తీసుకున్నా, తేజ సజ్జా ‘హనుమాన్‌’ (HanuMan)ను తీసుకున్నా.. రీసెంట్‌గా వచ్చిన ప్రభాస్ ‘కల్కి 2898AD’ (Kalki 2898 AD)ని తీసుకున్నా కూడా ఇప్పుడంతా ఏ ట్రెండ్ నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దైవ భక్తిని చాటుతూ, సైంటిఫిక్ టచ్‌తో దేవుడి శక్తిని చూపించేలా కథ, కథనాలతో సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ అవుతోంది. అలాంటి కథ, కథనాలతో టాలీవుడ్‌లో రాబోతోన్న సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే..

Also Read- Pushpa 2: సహనానికి పరీక్షా? నిర్మాతల పాలిట శాపమా?   


మంచు విష్ణు, ముఖేష్ సింగ్‌ల ‘కన్నప్ప’ (Kannappa).. మెగాస్టార్ చిరంజీవి, వశిష్టల ‘విశ్వంభర’ (Vishwambhara).. నటసింహం బాలయ్య, బోయపాటిల ‘అఖండ 2’ (Akhanda 2).. నిఖిల్, చందూ మొండేటిల ‘కార్తికేయ3’ (Karthikeya 3).. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మల ‘జై హనుమాన్’ (Jai Hanuman).. రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల ‘కల్కి 2898 AD’ పార్ట్ 2 (Kalki 2898 AD Part 2).. అశ్విన్ బాబు, అప్సర్‌ల ‘శివం భజే’ (Shivam Bhaje) వంటి చిత్రాలు సోషియో ఫాంటసి జానర్‌లో టాలీవుడ్ సత్తా చాటేందుకు రానున్నాయి. అలాగే వీటితో పాటు సోషియో ఫాంటసీ టచ్‌తో మరో వైవిధ్యభరిత చిత్రం కూడా టాలీవుడ్‌ నుంచి రాబోతోంది. అదే ‘అరి’ చిత్రం.

‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో ‘అరి’ (Ari Movie) చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శ్రీకృష్ణుడి పాత్రే హైలెట్‌గా సినిమా ఉంటుందని, ఇంత వరకు ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలనే కాన్సెప్ట్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అంతేకాదు, ఈ సినిమా క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తుందనేలా మేకర్స్ చెబుతున్న తీరు చూస్తుంటే.. పై సినిమాలకు పోటీగా ‘అరి’ కూడా ఉంటుందని భావించవచ్చు. ఏదిఏమైనా దర్శకులంతా ఒక్కసారిగా దైవభక్తిని ప్రదర్శిస్తూ.. మన పురాణ ఇతిహాసాలపై దృష్టి పెట్టడం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లై.. ఇంకొందరికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం.

Read Latest Cinema News

Updated Date - Jul 18 , 2024 | 04:11 PM