Ari: మైథాలజీ ట్రెండ్‌లో.. బ్లాక్‌బస్టర్ పక్కా అంటున్నారు

ABN , Publish Date - Jul 04 , 2024 | 08:10 PM

మహాభారత ఇతిహాసాన్ని, అందులోని పాత్రలను బ్యాక్‌డ్రాప్‌గా వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళుతోంది. ఇప్పుడిదే క్రమంలో అరిషడ్వర్గాలు, శ్రీకృష్ణుడి గొప్పతనం వంటి అంశాలతో తెరకెక్కిన ‘అరి’ సినిమా కూడా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని అంటున్నారు మేకర్స్.

మైథాలజీ.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ ట్రెండ్‌గా మారింది. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రతి చిత్ర పరిశ్రమలోనూ కనిపిస్తోంది. ‘కార్తికేయ 2, హనుమాన్, కాంతార, ఓ మై గాడ్’ సినిమాలు మైథాలజీ, దేవుడి నేపథ్యంతో వచ్చి ఘన విజయాలు అందుకున్నాయి. రీసెంట్‌గా మహాభారత ఇతిహాసాన్ని, అందులోని పాత్రలను బ్యాక్‌డ్రాప్‌గా వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళుతోంది. ఇప్పుడిదే క్రమంలో అరిషడ్వర్గాలు, శ్రీకృష్ణుడి గొప్పతనం వంటి అంశాలతో తెరకెక్కిన ‘అరి’ (Ari) సినిమా కూడా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని అంటున్నారు మేకర్స్.

Also Read- Manamey OTT Release Date: ఓటిటి లోకి ఇంకో ఫ్లాప్ మూవీ వచ్చేస్తోంది, ఎప్పుడు ఎక్కడ అంటే...

అరిషడ్వర్గాలను కాన్సెప్ట్‌గా తీసుకుని ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు. దీంతో ‘అరి’ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడుతోంది. మైథాలజీ బ్యాక్ డ్రాప్ సూపర్ హిట్ సినిమాల్లాగే ‘అరి’ మూవీ మీద భారీ అంచనాలే ఏర్పడుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. (Ari Movie Update)


Ari.jpg

వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం.. ‘పేపర్ బాయ్’ చిత్రంతో సక్సెస్ కొట్టిన జయశంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుందని.. అలాగే హిందీ రీమేక్‌పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లుగా టాక్ వినబడుతోంది.

Read Latest Cinema News

Updated Date - Jul 04 , 2024 | 08:10 PM