Anasuya Bharadwaj : గ్లామర్ నా బలం అంటారు.. మరికొందరు ఇంకోటి అంటారు
ABN , First Publish Date - 2023-10-10T20:43:23+05:30 IST
"నేను రొటీన పాత్రలకు దూరంగా ఉంటా(Prema vimanam). ఈ మధ్యకాలం నాకు చక్కని పాత్రలు దక్కుతున్నాయి. చాలామంది నా బలం గ్లామర్ అనుకుంటారు. కొంతమంది అయితే ఆ గ్లామర్‌తో కనిపిస్తే తిడుతుంటారు. కానీ నేను మాత్రం నాకు నచ్చిందే చేస్తా’’ అని గ్లామర్ డాల్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) అన్నారు.
"నేను రొటీన పాత్రలకు దూరంగా ఉంటా(Prema vimanam). ఈ మధ్యకాలం నాకు చక్కని పాత్రలు దక్కుతున్నాయి. చాలామంది నా బలం గ్లామర్ అనుకుంటారు. కొంతమంది అయితే ఆ గ్లామర్‌తో కనిపిస్తే తిడుతుంటారు. కానీ నేను మాత్రం నాకు నచ్చిందే చేస్తా’’ అని గ్లామర్ డాల్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) అన్నారు. ఆమె కీలక పాత్ర పోషించిన చిత్రం ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ సినిమాను ఈ నెల 13న జీ 5లో రిలీజ్ చేయటానికి నిర్మాతలు సిద్థమయ్యారు. అయితే ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు ఓ రోజు ముందుగానే అంటే అక్టోబర్ 12నే జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. సంగీత శోభన, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మించారు. సంతోష్ కాటా దర్శకత్వం వహించారు. తాజాగా ప్రీమియర్ షో అనంతరం అనసూయ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు.
‘‘కొన్నిసార్లు దర్శకులు చెప్పిన కథకు, తీసిన దాంట్లో తేడా ఉంటుంది. కానీ సంతోష్ మాత్రం ఏం చెప్పాడో.. ఎలా చెప్పాడో అదే తీశాడు. ఎక్కువ సెట్స్ వేయలేదు కానీ నేచురల్‌గా షూట్ చేశారు. నేను ప్రతిసారి కొత్తగా ఉండే కథలను ఎంచుకుంటూ వస్తాను. నా బలం గ్లామర్ అని కొంతమంది అంటారు. అదే గ్లామర్‌తో కనిపిస్తే కొందరు తిడతారు. ఎవరో ఏదో అన్నారని నా పని నేను మానుకోను. సినిమాలో అయినా నిజ జీవితంలో అయినా ఆనందంగా ఉండేందుకు నాకు నచ్చిన పాత్రలు, పనులే చేస్తాను. ఈ ప్రయాణంలో ఈ సినిమాతో ప్రేమలో పడిపోయాను. మంచి సినిమా చూశామనే ఫీలింగ్ మాత్రం అందరికీ వస్తుంది’’ అని అన్నారు.