Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన యోదా డయాగ్నోస్టిక్స్ కొత్త బ్రాంచ్
ABN, Publish Date - Apr 21 , 2024 | 07:01 PM
పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, మాదాపూర్‌లో యోదా డయాగ్నొస్టిక్స్ కొత్త బ్రాంచ్‌ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోదా అధినేత కంచర్ల సుధాకర్‌ను మంత్రి దామోదర్ రాజ నరసింహ ఒక ప్రశ్న అడిగారు. ఈ డయాగ్నొస్టిక్ సెంటర్ చాలా ఆధునికతగా ఉంది కదా, మరి ఇది పేద వారికి ఎంత వరకు అందుబాటులో ఉంటుంది? అని మంత్రి దామోదర్ రాజ నరసింహ ప్రశ్నకి అదే వేదికపై మెగాస్టార్ చిరంజీవి సమాధానమిచ్చారు.
పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాదాపూర్‌లో యోదా డయాగ్నొస్టిక్స్ (Yoda Diagnostics) కొత్త బ్రాంచ్‌ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోదా అధినేత కంచర్ల సుధాకర్ (Kancharla Sudhakar)ను మంత్రి దామోదర్ రాజ నరసింహ (Damodar Raja Narasimha) ఒక ప్రశ్న అడిగారు. ఈ డయాగ్నొస్టిక్ సెంటర్ చాలా ఆధునికతగా ఉంది కదా, మరి ఇది పేద వారికి ఎంత వరకు అందుబాటులో ఉంటుంది? అని మంత్రి దామోదర్ రాజ నరసింహ ప్రశ్నకి అదే వేదికపై మెగాస్టార్ చిరంజీవి సమాధానమిచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కంచర్ల సుధాకర్ నాకు తమ్ముడు లాంటి వాడు, ఆయన గతంలో అమీర్ పేటలో యోదా బ్రాంచ్ ప్రారంభించినప్పుడు నేను అడిగాను, అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఈ యోదా డయాగ్నొస్టిక్ సెంటర్ పేద ప్రజలకు, మా సినిమా కార్మికులకు ఎంత వరకు ఉపయోగపడుతుంది అని? దానికి కంచర్ల సుధాకర్ ఇలా అన్నారు.
‘అన్నయ్య మన సినిమా వారి అందరికి హెల్త్ కార్డు ఇస్తాను, అవి చూపిస్తే వారికి అతి తక్కువ ధరలకే ఇక్కడ ఉన్న అన్ని టెస్టులు చేయించుకోవచ్చు అని’. ఆ మాటలకి నాకు ఎంతో స్ఫూర్తి కలిగి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust)ని యోదా డయాగ్నొస్టిక్‌తో అనుసంధానం చేసి 14,000 మంది సినీ కార్మికులకు వారి కుటుంబాలకు హెల్త్ కార్డ్స్‌ని మంజూరు చేశాము. ఇప్పుడు ఈ మాదాపూర్ బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా యుట్యూబర్స్, ఇన్ఫ్లుఎన్సర్స్‌కి కూడా హెల్త్ కార్డ్స్ మంజూరు చేస్తున్నామని చెప్పి.. చిరంజీవి స్వయానా తన చేతుల మీదగా హెల్త్ కార్డ్స్ మంజూరు చేశారు. కంచర్ల సుధాకర్ లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారని, ఒక పక్క వ్యాపారం, ఇంకో పక్క ఉదాసీనత రెండు చాటుకోవడం చాలా రేర్ కాంబినేషన్ అని మెగాస్టార్ కొనియాడారు.