Chiranjeevi : సాయం చేస్తే వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేం!

ABN , First Publish Date - 2023-10-02T15:32:37+05:30 IST

పేదలకు, అవసరార్ధులకు ఎన్నో రకాలుగా సేవలను అందించిన చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను ప్రారంభించి 25 వసంతాలు పూర్తయింది. సాధారణ నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన చిరంజీవి తను ఎదిగిన క్రమంలో తోటివారికి తన వంతు సాయం చేయాలనే గొప్ప సంకల్పంతో 1998 అక్టోబర్‌ 2 ుచిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ను ప్రారంభించారు.

Chiranjeevi : సాయం చేస్తే వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేం!

పేదలకు, అవసరార్ధులకు ఎన్నో రకాలుగా సేవలను అందించిన చిరంజీవి ఛారిటబుల్‌ (CCT) ట్రస్ట్‌ను ప్రారంభించి 25 వసంతాలు పూర్తయింది. సాధారణ నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన చిరంజీవి (Chiranjeevi) తను ఎదిగిన క్రమంలో తోటివారికి తన వంతు సాయం చేయాలనే గొప్ప సంకల్పంతో 1998 అక్టోబర్‌ 2 ుచిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ను ప్రారంభించారు. దీనిలో భాగంగా బ్లడ్‌, ఐ బ్యాంకులను మొదలుపెట్టారు. కరోనా సమయంలో ఆక్సిజన్‌ సిలిండర్లను సైతం సరఫరా చేశారు. నేటికి ట్రస్ట్‌ ప్రారంభించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రస్ట్‌ను ప్రారంభించిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. (25 years of Chiranjeevi Charitable trust)

Chiru.gif

‘‘దేశ ప్రజలకు ఈరోజు ఎంతో ముఖ్యమైనది. నేను చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించిన నాటి క్షణాలను గుర్తు చేసుకుంటున్నా. పాతిక వసంతాల అద్భుతమైన జర్నీ ఇది. ఇప్పటివరకూ 10 లక్షల బ్లడ్‌ యూనిట్లను ేసకరించి అవసరమైన వారికి అందజేశాం. 10 వేల మందికి కంటి చూపునిచ్చాం. కరోనా సమయంలో వేల మందికి సాయం అందించాం. తోటి మానవాళికి సాయం చేయడం వల్ల వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేం. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వేదికగా ఎన్నో సేవ కార్యక్రమాల్లో తమ వంతు సాయం అందిస్తున్న అక్కచెల్లెళ్లు, సోదరులు, అభిమానులకు సెల్యూట్‌ చేస్తున్నా. మన దేశానికి మనం చేస్తున్న చిరు సాయమిది ఇది’’ అంటూ చిరంజీవి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

3.gif

సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ పొడక్షన పనులు మొదలయ్యాయి. యు.వి క్రియేషన్స సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తదుపరి చిరు తనయ సుష్మిత కొణిదెల నిర్మించబోయే చిత్రం పట్టాలెక్కనుందనీ, ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తారని టాక్‌.

Chiru-2.gif

Updated Date - 2023-10-02T15:36:39+05:30 IST