మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vijay Deverakonda: అల్లు అర్జున్ తరహాలో విజయ్ దేవరకొండకి కూడా...

ABN, Publish Date - May 06 , 2024 | 02:42 PM

తన సినిమా చిత్రీకరణ కోసమని విశాఖపట్నం వెళ్లిన విజయ్ దేవరకొండకి అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయంకి వచ్చి స్వాగతం చెప్పారు. తరువాత మోటార్ బైక్ ర్యాలీని కూడా విజయ్ వాహనం వెనకాలే అభిమానులు నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ కి కూడా అతని అభిమానులు ఇలాంటి స్వాగతం పలికితే, ఇప్పుడు విజయ్ కి కూడా అలాంటి స్వాగతం లభించడం ఆసక్తికరం.

Fans receiving Vijay Deverakonda at Visakhapatnam Airport

కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన 'పుష్ప 2' సినిమా చిత్రీకరణ కోసం విశాఖపట్నం వెళ్ళినప్పుడు, విశాఖపట్నం విమానాశ్రయం నుండి అభిమానులు ఒక ర్యాలీ నిర్వహించారు. అల్లు అర్జున్ తన కారులో అభిమానులకి అభివాదం చేసుకుంటూ తను బస చేస్తున్న హోటల్ వరకు వెళితే, అభిమానులు కూడా మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించి, అల్లు అర్జున్ వాహనం వెనకాలే వెళ్లారు. అప్పుడు ఈ వార్త వైరల్ అయింది, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అదే తరహాలో విశాఖపట్నం వెళ్లారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేయబోతే సినిమా కోసమని విశాఖపట్నం వచ్చిన విజయ్ దేవరకొండకి విమానాశ్రయంలో పెద్దపెట్టున అభిమానులు విచ్చేసారు. అక్కడ నుండి అభిమానులు విజయ్ వాహనం వెనకాలే మోటారు సైకిల్ ర్యాలీ లా వెళ్లారు.

ఇక విజయ్ కూడా తన అభిమానులను పలకరించడానికి తన కారు టాప్ ఓపెన్ చేసి నిలుచొని అందరికీ అభివాదం చేసుకుంటూ తను బసచేయనున్న హోటల్ కి వెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఎలా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారో, అదే తరహాలో ఇప్పుడు విజయ్ దేవరకొండ కి కూడా అభిమానులు ర్యాలీ నిర్వహించడం ఆసక్తికరం.

Updated Date - May 06 , 2024 | 02:44 PM