Vijay Deverakonda: 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష.. ఈ పనితో ‘ఖుషీ’గా ఉంది

ABN , First Publish Date - 2023-09-15T16:31:09+05:30 IST

‘ఖుషి’ సినిమాకు ఘన విజయాన్ని అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. ‘ఖుషి’ హ్యాపీనెస్ షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్‌కు లక్ష రూపాయల చొప్పున చెక్స్ అందించారు. ఈ చెక్స్ అందుకుంటున్న ఫ్యామిలీస్ ఉద్వేగానికి లోనై విజయ్‌ను హగ్ చేసుకున్నారు.

Vijay Deverakonda: 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష.. ఈ పనితో ‘ఖుషీ’గా ఉంది
Vijay Deverakonda

‘ఖుషి’ (Kushi) సినిమాకు ఘన విజయాన్ని అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఆయన హీరోగా, సమంత (Samantha) హీరోయిన్‌గా శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన చిత్రం ‘ఖుషి’ (Kushi Movie). ఈ సినిమా సక్సె‌స్‌కు సంబంధించిన హ్యాపీనెస్ షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్‌కు లక్ష రూపాయల చొప్పున విజయ్ చెక్స్ అందించారు. ఈ చెక్స్ అందుకుంటున్న ఫ్యామిలీస్ ఉద్వేగానికి లోనై విజయ్‌ను హగ్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ (Vijay Deverakonda Speech).. నాకు ఇంత ప్రేమ పంచుతున్న మీ కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇలా ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకున్న వాడినే. చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా వెకేషన్ వెళ్తే నేను డబ్బులు ఇంట్లో అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఉండిపోయేవాడిని. అప్పుడు మా ఫ్రెండ్స్ టూర్‌లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచించేవాడిని. తమ్ముడి ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బందిపడుతున్నప్పుడు అలాంటి అవసరంలో ఎవరైనా కొంత డబ్బు ఇస్తే బాగుండును అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఒక ఫ్యామిలీగా ఈ స్థాయికి చేరుకున్నా. ఇవాళ మీకు ఈ హెల్ప్ చేయగలుగుతున్నా అంటే అది నా పర్సనల్ కోరిక.


Vijay.jpg

ఈ లక్ష రూపాయలు అందిన తర్వాత కొంచెం సంతోషం కలిగి ఒత్తిడి తగ్గి, బలాన్నిచ్చి మీకు ఆనందంగా అనిపిస్తే నాకు అదే సంతృప్తినిస్తుంది. ఈ చిన్న సాయం మీకు ఉపయోగపడితే నాకు హ్యాపీ. నాకు థ్యాంక్స్ చెప్పకండి. మీతో నా ప్రేమను షేర్ చేసుకుంటున్నా అంతే. లాస్ట్ టైమ్ కొంతమంది పిల్లల్ని టూర్‌కు పంపించా. ఈ ప్రోగ్రాం అనౌన్స్ చేసినప్పటి నుంచి 50 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. అయితే 100 మందికి మాత్రమే చేయగలుగుతున్నాం. ప్రతి ఇయర్ ఇంకొందరికి హెల్ప్ చేస్తా. ఇలా నేను స్ట్రాంగ్‌గా ఉన్నంతవరకు, నేను సినిమాలు చేస్తున్నంతకాలం మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థాంక్స్.. అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*Japan: ‘జపాన్’ డబ్బింగ్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన మేకర్స్

*********************************

*Baby Team: ‘బేబీ’ సినిమాలో ఆ సీన్లపై పోలీస్ కమిషనర్‌కు వివరణ ఇచ్చాం

***********************************

Updated Date - 2023-09-15T16:32:40+05:30 IST