Viraaji: వరుణ్ సందేశ్ ‘విరాజి’‌తో సూపర్ హిట్ కొట్టబోతున్నాడు

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:51 PM

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘విరాజి’. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ‘కొత్త బంగారు లోకం’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా మేకర్స్ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Viraaji Movie Trailer Launch Event

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ (Varun Sandesh) ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘విరాజి’ (Viraaji). ఆద్యంత్ హర్ష (Adhyanth Harsha) దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల (Mahendra Nath Kondla) నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ‘కొత్త బంగారు లోకం’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) చేతుల మీదుగా మేకర్స్ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. వరుణ్ సందేశ్ కెరీర్‌లోనే ఓ విభిన్నమైన చిత్రం కాబోతోందనే ఫీల్‌ని ఇస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Kirak RP: జగన్ మానసికస్థితిపై ఎర్రగడ్డ‌లో టెస్ట్ చేయాలి.. విజయసాయి రెడ్డి దుర్మార్గుడు!!


ట్రైలర్ విడుదల అనంతరం శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ‘‘వరుణ్ సందేశ్ నా మొదటి సినిమా ‘కొత్త బంగారు లోకం’లో హీరోగా నటించాడు. ఇప్పుడే ఆయన నటించిన ‘విరాజి’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి.. చూసాను. ట్రైలర్ చాలా బాగుంది. థ్రిల్లింగ్‌గా అనిపించింది, విజువల్స్ కొత్తగా ఉన్నాయి, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి, రిచ్‌గా ఉంది సినిమా. సినిమా టైటిల్, వరుణ్ సందేశ్ గెటప్ కూడా మరియు సినిమా కథ కూడా చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే వరుణ్ సందేశ్‌కి సూపర్ హిట్ పక్కాగా అనిపిస్తుంది. నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్లకు, దర్శకుడు ఆద్యంత్‌కు అలాగే చిత్రయూనిట్‌కు నా అభినందనలు. వరుణ్ సందేశ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ‘విరాజి’ చిత్రం ఆగస్టు 2న విడుదల కాబోతోంది. అందరు చూసి సూపర్ హిట్ చేయాలని కోరుతున్నాను’’ అని తెలిపారు. (Srikanth Addala Launches Viraaji Trailer)


varun-Sandesh.jpg

ట్రైలర్ విషయానికి వస్తే.. ఇప్పుడే చనిపోయాడు బ్రో.. ఫ్రెష్‌గా తిరిగి వస్తాడని అని వరుణ్ సందేశ్ చెబుతున్న డైలాగ్‌తో ఈ సినిమా ఆత్మలపై చిత్రీకరించిన థ్రిల్లర్ అని అర్థమవుతుంది. ట్రైలర్‌లోని ఒక్కో షాట్.. ఓ వైవిధ్యతను తెలియజేస్తుంది. ప్రేక్షకులకు సూపర్బ్ థ్రిల్ ఇచ్చే కంటెంట్ ఇందులో ఉన్నట్లుగా ఈ ట్రైలర్‌ని ప్రతి సన్నివేశం తెలియజేస్తుంది. శ్రీకాంత్ అడ్డాల చెప్పినట్లుగా అతనికి ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా.. వరుణ్ సందేశ్‌ని మళ్లీ బిజీ చేసే చిత్రం అవుతుందని మాత్రం చెప్పొచ్చు.

Read Latest Cinema News

Updated Date - Jul 21 , 2024 | 04:52 PM

VIRAAJI: కొత్త అవ‌తారంలో వ‌రుణ్ సందేశ్‌.. ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడే

Viraaji: ‘విరాజి’ మూవీ ట్రైలర్

Viraaji: ‘విరాజి’గా హీరో వరుణ్ సందేశ్!

Varun Sandesh: ఆకట్టుకుంటోన్న.. వరుణ్ సందేశ్ ‘నింద’ పోస్టర్

Varun Sandesh: ఏంటి అలా అయిపోయాడు పాపం!