Viraaji: ‘విరాజి’గా హీరో వరుణ్ సందేశ్!

ABN , Publish Date - Jul 02 , 2024 | 05:07 PM

ఒకప్పుడు బిజీ హీరోగా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసిన వరుణ్ సందేశ్.. ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి, మళ్లీ తన సత్తా చాటుతున్నారు. రీసెంట్‌గా ఆయన నటించిన ‘నింద’ సినిమా విడుదలై మంచి ఆదరణను రాబట్టుకోగా.. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్ర టైటిల్‌ ‘విరాజి’ని మంగళవారం మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించి గ్రాండ్‌గా విడుదల చేశారు.

Viraaji: ‘విరాజి’గా హీరో వరుణ్ సందేశ్!
Hero Varun Sandesh Starring Viraaji Title Announcement

ఒకప్పుడు బిజీ హీరోగా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసిన వరుణ్ సందేశ్ (Varun Sandesh).. ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి, మళ్లీ తన సత్తా చాటుతున్నారు. రీసెంట్‌గా ఆయన నటించిన ‘నింద’ (Nindha) సినిమా విడుదలై మంచి ఆదరణను రాబట్టుకోగా.. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్ర టైటిల్‌ని మంగళవారం మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించి గ్రాండ్‌గా విడుదల చేశారు. మహా మూవీస్‌తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్‌పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘విరాజి’ (Viraaji) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

టైటిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల (Mahendra Nath Kondla) మాట్లాడుతూ.. ‘విరాజి’ చాలా మంచి టైటిల్. వరుణ్ సందేశ్ ఇప్పటి వరకు ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఆయనను కొత్త అవతారంలో చూపించే చిత్రమిది. మూవీ చాలా బాగా వచ్చింది. ఆగస్టు 2న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. ఈ నెల రోజులు బాగా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేశామని తెలపగా.. దర్శకుడు ఆద్యంత్ హర్ష (Adhyanth Harsha) మాట్లాడుతూ.. దర్శకుడిగా నా మొదటి సినిమా ‘విరాజి’. ఇది మా సినిమా ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్. ఈ సినిమాకు సంబంధించి నేను ఇద్దరు వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకరు మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర. ఆయన కథ విని ప్రొడ్యూసర్ మహేంద్ర‌గారి దగ్గరకు తీసుకెళ్లారు. మహేంద్రగారు ఒక ప్రొడ్యూసర్ గానే కాకుండా ఒక టెక్నీషియన్‌గా కూడా మా మూవీకి వర్క్ చేశారు. ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. మరో ఇంపార్టెంట్ వ్యక్తి వరుణ్ సందేశ్. ఆయన ఎంతో చొరవగా ఈ మూవీ చేశారు. త్వరలో రివీల్ చేసే మా మూవీ ఫస్ట్ లుక్ చూస్తే మీరు తప్పకుండా ఇంప్రెస్ అవుతారు. ఇది వరుణ్ సందేశ్‌కు టైలర్ మేడ్ మూవీ. ఈ సినిమా విషయంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు.


Viraaji-Poster.jpg

హీరో వరుణ్ సందేశ్ (Hero Varun Sandesh) మాట్లాడుతూ.. ఈ సినిమా కథ చెప్పేందుకు హర్ష నా దగ్గరకు వచ్చాడు. ఫస్టాఫ్ వింటున్నప్పుడు పది నిమిషాల తర్వాత కథ ఇలా ఉంటుందేమో అని రెండు మూడు చోట్ల గెస్ చేశాను. సెకండాఫ్‌కు వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. కథ చాలా బాగుందని హర్షకు చెప్పాను. ఈ సినిమా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యా. మా డైరెక్టర్ హర్షకు ఇది మొదటి సినిమా కానీ ఆయన చేయబోయే చాలా సినిమాలకు ఇది మొదటి అడుగు. ఇంతకు ముందు నేను చేసిన ‘నింద’ మూవీ సక్సెస్ సాధించి.. నాకు మంచి మోటివేషన్, బూస్ట్ ఇచ్చింది. ‘నింద’ డైరెక్టర్ రాజేశ్‌కు రెండు పెద్ద ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. హర్షకు కూడా అలాంటి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ‘విరాజి’ సినిమా నేను నా 17 ఏళ్ల కెరీర్‌లో చేయని ఒక డిఫరెంట్ మూవీ. అలాంటి మోస్ట్ క్రేజియెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10వ తేదీన విరాజి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. అది చూడగానే అంతా సర్‌ప్రైజ్ అవుతారు. ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది. నేను ఈ మూవీ రిలీజ్ కోసం ఎగ్జైటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను. మా నిర్మాత మహేంద్ర నాకు బ్రదర్‌లాంటి వారు. అందరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణి.. మ్యూజిక్ డైరెక్టర్ ఎబినెజర్ పాల్ (ఎబీ) వంటి వారు చిత్ర విశేషాలను తెలిపారు. (Viraaji Title Announcement)

Updated Date - Jul 02 , 2024 | 05:16 PM