Racharikam: అప్సరా రాణి ‘రాచరికం’.. టిక్కు టిక్కు సాంగ్ వచ్చేసింది..

ABN, Publish Date - Sep 06 , 2024 | 09:53 PM

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘రాచరికం’. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘టిక్కు టిక్కు’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్ స్పెషల్ ఏమిటంటే..

Apsara Rani in Racharikam Movie

అప్సరా రాణి (Apsara Rani), విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘రాచరికం’ (Racharikam). చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్నాయి. ‘రాచరికం’కు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, ఆ పోస్టర్లలో అప్సరా రాణి కనిపించిన తీరు సినిమాపై భారీగా క్రేజ్ పెంచేయగా.. తాజాగా ఈ సినిమా నుంచి ‘టిక్కు టిక్కు’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ స్పెషల్ ఏమిటంటే..

Also Read- Tollywood - Vinayaka Chavithi: దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. కరుణించయ్యా దేవా..

‘టిక్కు టిక్కు’ అంటూ సాగిన ఈ హుషారైన పాటను ప్రముఖ రచయిత పెంచల్ దాస్ (Penchaldas) రాశారు. ఈ పాట రాయడమే కాకుండా సింగర్ మంగ్లీతో కలిసి ఆయనే ఆలపించారు. సంగీత దర్శకుడు వెంగి ఇచ్చిన ఈ బాణీ ఎంతో హుషారుగా అనిపిస్తూ, వినగానే కిక్కిచ్చేలా ఉంది. పర్‌ఫెక్ట్ జాతర సాంగ్‌లా ఎంతో రిచ్‌గా పాటను తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. పోలంకి విజయ్ కొరియోగ్రఫీతో ఈ పాట తెరపై విజువల్ ఫీస్ట్‌గా కనిపించేలా ఉంది. (Tikku Tikku Lyrical Song From Racharikam)


హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్‌గా, రామ్ ప్రసాద్ డైలాగ్ రైటర్‌గా, చాణక్య ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్‌గా, జేపీ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Sep 06 , 2024 | 09:53 PM