మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elections 2024: ఓటు ఎంత బలమైనదో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది

ABN, Publish Date - May 11 , 2024 | 01:47 PM

సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఓటు వెయ్యడానికి సమాయత్తం అవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు ఓటు అనే ఆయుధంతో ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి, ఎటువంటి ప్రభుత్వం కావాలో శాసిస్తారు. ఈ ఓటు నేపథ్యంలో వచ్చిన సినిమా 'మార్టిన్ లూథర్ కింగ్', సోనీ లివ్ లో ప్రసారం అవుతోంది. ఈ సినిమా చూస్తే ఓటు ఆవశ్యకత ఏంటో తెలుస్తుంది. ఓటు వెయ్యనివాళ్ళకి కూడా కనువిప్పు కలుగుతుంది.

Martin Luther King tells about the power of Vote

తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణాలో లోక్ సభ, ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ప్రజలకు ఓటు అనేది ఒక గొప్ప ఆయుధం, తమకి ఎటువంటి నాయకుడు కావాలి, ఎటువంటి ప్రభుత్వం ఏర్పడాలి అనేది నిర్ణయించుకోవడానికి ఈ ఆయుధం వుపయోగించి ప్రజలే నిర్ణయిస్తారు. అందుకనే ప్రతివారు ఓటు తప్పకుండా వెయ్యాలి అనే విషయాన్నీ అటు ఎన్నికల సంఘం చెపుతూ ఉంటుంది, అలాగే చాలామంది సెలబ్రిటీలతో చెప్పిస్తూ ఉంటుంది. ఓటుపై అవగాహన పెంపొందించడానికి అందరూ శాయశక్తులా కృషి చేస్తూ వుంటారు. (Martin Luther King film tells about the power of Vote)

ఓటు అనేది ఎంత బలమైనదో ఆమధ్య 'మార్టిన్ లూథర్ కింగ్' అనే సినిమా విడుదలైంది. సంపూర్ణేష్ బాబు, వికె నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఓటు విలువ గురించి, దాని ఆవశ్యకత, ఆ ఓటుతో తమ గ్రామానికి, తద్వారా సమాజానికి, దేశానికి ఎంత మేలు జరుగుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. (This film creates awarenss on Vote and also people who don't want to come out to vote)

'మార్టిన్ లూథర్ కింగ్' అనే సినిమా ఒక సందేశాత్మక చిత్రం, ఓటు విలువ, దానికుండే బలం, ఆ ఓటుతో ప్రజాస్వామ్యంలో ఎటువంటి మార్పులు చెయ్యొచ్చో చెప్పే చిత్రం. సమకాలీన రాజకీయాలని ఒక పక్క ఎత్తి చూపుతూ, ఇంకో పక్క విమర్శనాస్త్రాలని కూడా ఈ చిత్రంలో సంధిస్తారు. ఓటు వేసే ముందు, ఓటు వెయ్యకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళు అందరూ చూడాల్సిన సినిమా ఇది. అలాగే ఓటు అనేది ఎంతో పవిత్రమైనది, ప్రలోభాలకు లొంగకుండా ప్రతి పౌరుడూ అలోచించి ఓటు వెయ్యాలి. ఈ సినిమా సోనీ లివ్ ఓటిటి లో వుంది, అక్కడ చూసుకోవచ్చు.

Updated Date - May 11 , 2024 | 01:50 PM