Martin Luther King: ఓటీటీలోకి.. సంపూర్ణేశ్ బాబు పవర్ ఫుల్ పొలిటికల్ సెటైర్ మూవీ ‘మార్టిన్ లూథర్ కింగ్’
ABN , First Publish Date - 2023-11-13T18:58:46+05:30 IST
థియేటర్లలో విడుదలైన సినిమాలు భారీ కలెక్షన్లు రాబడితేనే తప్పా రెండు వారాలు నడవలేని పరిస్థితి వచ్చేసింది. దాంతో దాదాపు చాలా సినిమాలు నెల రోజుల లోపే ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం మరో ఆసక్తికరమైన తెలుగు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం అయింది.
థియేటర్లలో విడుదలైన సినిమాలు భారీ కలెక్షన్లు రాబడితేనే తప్పా రెండు వారాలు నడవలేని పరిస్థితి వచ్చేసింది. దాంతో దాదాపు చాలా సినిమాలు నెల రోజుల లోపే ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం మరో ఆసక్తికరమైన తెలుగు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం అయింది. అదే ఔట్ అంఢ్ ఔట్ కామెడీ, పొలిటికల్ సెటైర్ తో వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King).
చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం కరెక్టుగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఆక్టోబర్ 27న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చిన్నప్పటికీ ఎందుకనో ప్రేక్షకాదరణ పొందలేక పోయింది. అయితే థియేటర్లలో ఈ సినిమాను మిస్సైన వారు ఇప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే చూసి హాయ్ గా ఎంజాయ్ చేయవచ్చు.
2021 సంత్సరంలో రెండు జాతీయ అవార్డులు సాధించిన తమిళ చిత్రం మండేలాను తెలుగులో పూజా ఆపర్ణ దర్శకత్వంలో సంపూర్ణేశ్ బాబు (Sampoornesh Babu) హీరోగా రిమేక్ చేశారు. ఓటు విలువను తెలిపే మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రానికి తమిళనాట వచ్చినంత స్పందన ఇక్కడ దక్కక పోవడం గమానార్హం.
ప్రముఖుల, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఈనెల 29 నుంచి గానీ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ వార్తలపై అధికారికంగా సమాచారం లేనప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు బాగా వస్తున్నాయి.