The GOAT: విజయ్, మీనాక్షి చౌదరిల ‘స్పార్క్’ చూశారా..

ABN, Publish Date - Aug 03 , 2024 | 09:37 PM

దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘The GOAT’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ చార్ట్ బస్టర్ నోట్‌లో స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ విజిలేస్కో, సెకండ్ సింగిల్ నిన్ను కన్న కనులే చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా.. శనివారం మూడో సింగిల్ ‘స్పార్క్’ని మేకర్స్ విడుదల చేశారు.

The GOAT Movie Still

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay), వెంకట్ ప్రభు (Venkat Prabhu)ల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘The GOAT’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). విజయ్ సరసన స్ట్రయికింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ చార్ట్ బస్టర్ నోట్‌లో స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ ‘విజిలేస్కో’, సెకండ్ సింగిల్ ‘నిన్ను కన్న కనులే’ చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా.. శనివారం మేకర్స్ మూడో పాట ‘స్పార్క్’ (Spark)ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Buddy Movie Review: బడ్డీ మూవీ రివ్యూ

సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ పాటని థంపింగ్ బీట్స్‌తో వైరల్ ట్యూన్‌గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించి లిరిక్స్ క్యాచీగా ఉండగా.. యువన్ శంకర్ రాజా, వృష బాలు ఎనర్జిటిక్‌గా ఈ పాటను ఆలపించారు. ఈ సాంగ్‌లో విజయ్ డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి. విజయ్, మీనాక్షి చౌదరి మాగ్నటిక్ కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్‌గా దూసుకెళుతోంది. ముఖ్యంగా ఈ పాట చూసిన వారంతా విజయ్, మీనాక్షి చౌదరిల కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటుండటం విశేషం.


విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్ వంటివారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందించారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ హక్కులను సొంతం చేసుకుని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Read Latest Cinema News

Updated Date - Aug 03 , 2024 | 09:37 PM