Telusu Kada: ఫస్ట్ షెడ్యూల్ పూర్తి.. ‘తెలుసు కదా’

ABN, Publish Date - Sep 14 , 2024 | 04:18 PM

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటిస్తోన్న చిత్రం ‘తెలుసు కదా’. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ గురించి చెబుతూ.. మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేశారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌తో ప్రకటించారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

Telusu Kada Movie On Location Pic

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తోన్న చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). ఈ సినిమాలో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ అవతార్‌లో సిద్దు కనిపించనున్నారు. స్టైలిస్ట్ నీరజ కోన (Neeraja Kona) ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ ప్రారంభించుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ఆ షెడ్యూల్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ షెడ్యూల్ అనంతరం నెక్స్ట్ లెన్తీ షెడ్యూల్ కోసం ప్రస్తుతం సినిమా యూనిట్ సిద్ధమవుతోంది.

Also Read- Devara: ఎన్టీఆర్ డబ్బింగ్, జాన్వీ స్టయిలింగ్‌పై ట్రోలింగ్


ప్రస్తుతం ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ చెప్పినదాని ప్రకారం ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్షలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అవుట్‌పుట్‌తో టీమ్‌ హ్యాపీగా ఉన్నట్లుగా టాక్ వినబడుతోంది. ఈ సినిమాలోని మొదటి పాటను సిద్దు జొన్నలగడ్డ, రాశీఖన్నాలపై చిత్రీకరించారు. వర్కింగ్ స్టిల్స్ సెట్స్‌లో ప్లజెంట్ ఎట్మాస్స్పియర్‌ని తెలియజేస్తున్నాయి. (Telusu Kada Shooting Update)


హై బడ్జెట్‌తో, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ బాబా డీవోపీ కాగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొఫెషనల్ నవీన్ నూలి ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Also Read- Mathu Vadalara 2 Review: శ్రీసింహా నటించిన కామెడీ థ్రిల్లర్ 'మత్తు వదలరా 2' ఎలా ఉందంటే 

Read Latest Cinema News

Updated Date - Sep 14 , 2024 | 04:18 PM