Telusu Kada: ‘కెజియఫ్’ హీరోయిన్ జాయినైంది.. తెలుసు కదా..

ABN , Publish Date - Aug 21 , 2024 | 10:06 PM

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న న్యూ మూవీ ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైన విషయం తెలుసు కదా. అలాగే ఈ సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన డైరెక్టర్‌గా పరిచయమవుతున్న విషయం కూడా తెలుసు కదా. ఇందులో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి శ్రీనిధి శెట్టి అడుగెట్టినట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Telusu Kada Movie Shooting Spot

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Star Boy Siddu Jonnalagadda) హీరోగా చేస్తున్న న్యూ మూవీ ‘తెలుసు కదా’ (Telusu Kada) రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైన విషయం తెలుసు కదా. అలాగే ఈ సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన (Neeraja Kona) డైరెక్టర్‌గా పరిచయమవుతున్న విషయం కూడా తెలుసు కదా. ఇందులో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) లావిష్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై టాకీతో పాటు సాంగ్‌ని షూట్ చేశారు. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ స్టార్ట్ అయ్యింది. ఈ కొత్త షెడ్యూల్‌‌లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి (కెజియఫ్ ఫేమ్) జాయిన్ అయ్యింది. ఈ షెడ్యూల్‌‌లో చాలా కీలకమైన సన్నివేశాలని షూట్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read- Sanam Shetty: తమిళ చిత్ర పరిశ్రమలోనూ క్యాస్టింగ్ కౌచ్.. ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోను

అలాగే కెజియఫ్ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) షూట్‌లో జాయిన్ అయినట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ వర్కింగ్ స్టిల్ కూడా వదిలారు. ఈ పిక్‌లో దర్శకురాలు నీరజ కోన, హీరోయిన్‌ శ్రీనిధి శెట్టికి షాట్ చూపిస్తోంది. కెమెరాలో షాట్ చూస్తూ.. ఇద్దరూ హ్యాపీ మూడ్‌లో ఉన్నట్లుగా ఈ పిక్ తెలియజేస్తోంది. సిద్దు కెరియర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో.. ఆయన చాలా స్టయిలిష్‌గా కనిపిస్తారని కూడా తెలుస్తోంది.


Neeraja-Kona.jpg

నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ (TG Vishwa Prasad) ఈ సినిమాని ఖర్చుకు వెనకాడకుండా హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. ప్రస్తుతం బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలోనే ఇవ్వనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 21 , 2024 | 10:06 PM