Sri Sri Sri Rajavaru: తారక్ బామ్మర్ది సినిమా టీజర్ విడుదల..

ABN, Publish Date - Sep 27 , 2024 | 04:50 PM

‘మ్యాడ్’, ‘ఆయ్’ సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్. ఆయన హీరోగా వస్తోన్న మూడో చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. సతీష్ వేగేశ్న దర్శకుడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని దర్శకుడు వంశీ పైడిపల్లి చేతుల మీదుగా మేకర్స్ వదిలారు. టీజర్ చూసిన అనంతరం వంశీ పైడిపల్లి ఏమన్నారంటే..

Sri Sri Sri Rajavaru Movie Still

‘మ్యాడ్’ (Mad), ‘ఆయ్’ (Aay) సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్ (Narne Nithin). ఆయన హీరోగా.. ‘శతమానం భవతి’ సినిమాతో టాలీవుడ్‌కు నేషనల్ అవార్డ్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న, శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై ‘గుర్తుందా శీతాకాలం’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమా చేసిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ చింతపల్లి రామారావు కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ (Sri Sri Sri Rajavaru). లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా దసరా పండుగకు గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేశారు.

Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ

టీజర్ విడుదల అనంతరం డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ టీజర్ చాలా బాగుంది. ప్రేమను ఎలక్షన్స్‌తో పోలుస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న గతంలో ‘శతమానం భవతి’ సినిమాతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తే ఆయన ఫ్లేవర్‌లోనే మూవీ ఉంటుందని తెలుస్తోంది. మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. నార్నే నితిన్ నాకు ఎన్టీఆర్ మ్యారేజ్ టైమ్ నుంచి తెలుసు. ‘మ్యాడ్, ఆయ్’ సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్నాడు. ఆయనకు ఈ సినిమా మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఇస్తుందని నమ్ముతున్నాను. నార్నే నితిన్‌ను మాసీగా ప్రెజెంట్ చేశారు సతీష్ వేగేశ్న. నిర్మాత రామారావు ఎప్పటినుంచో ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. రావు రమేష్, నరేష్ లాంటి మంచి యాక్టర్స్ ఈ చిత్రంలో నటించారు. దసరా పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి చూసే పర్పెక్ట్ మూవీ ఇది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. అని తెలిపారు. (Sri Sri Sri Rajavaru Teaser Released)


నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. మా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమా టీజర్‌ను నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆయన మా టీమ్‌కు తన బెస్ట్ విశెస్ అందించినందుకు థ్యాంక్స్ చెబుతున్నాం. ‘మ్యాడ్, ఆయ్’ సినిమాల తర్వాత యంగ్ టాలెంటెడ్ హీరో నార్నే నితిన్‌కు ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ కాబోతోంది. ‘శతమానం భవతి’ సినిమాతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్న దర్శకులు సతీష్ వేగేశ్న.. మరోసారి మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాను హై బడ్జెట్‌తో క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. దసరాకు మా మూవీని థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నాం. ఈ దసరా సంబరాలను రెట్టింపు చేసే చిత్రమిది. ఈ సినిమాతో పండుగను మరింత ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నామని అన్నారు.

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 04:50 PM