మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shruti Haasan: ‘డకాయిట్’ షూటింగ్‌లోకి ఎంటరైంది..

ABN, Publish Date - Jun 13 , 2024 | 04:17 PM

అడివి శేష్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లోకి హీరోయిన్‌గా నటిస్తున్న శృతిహాసన్ జాయిన్ అయింది. ఈ ఇంపార్ట్టెంట్, మ్యాసీవ్ యాక్షన్ షెడ్యూల్‌లో లీడ్ కాస్ట్‌పై కీలకమైన సన్నివేశాలను, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరించబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

Shruti Haasan and Adivi Sesh

అడివి శేష్ (Adivi Sesh) హీరోగా రూపుదిద్దుకుంటోన్న మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ (Dacoit). ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లోకి హీరోయిన్‌గా నటిస్తున్న శృతిహాసన్ (Shruti Haasan) జాయిన్ అయింది. ఈ ఇంపార్ట్టెంట్, మ్యాసీవ్ యాక్షన్ షెడ్యూల్‌లో లీడ్ కాస్ట్‌పై కీలకమైన సన్నివేశాలను, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరించబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. టీమ్‌తో జాయిన్ అయిన సందర్భంగా శృతి హాసన్, శేష్‌తో సెల్ఫీని షేర్ చేశారు. (Dacoit Movie Update)

Also Read- Mega vs Allu: మరోసారి రివీలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం


‘డకాయిట్’ ఇద్దరు మాజీ ప్రేమికుల కథ, వారు తమ లైఫ్స్‌ని మార్చడానికి వరుస దోపిడీలకు ఏకం కావాలి. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు డివోపీగా పనిచేసిన షానీల్ డియో (Shaneil Deo) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్, శృతి జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. ఈ ప్రాజెక్ట్‌ను సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను ప్రజెంట్ చేస్తోంది. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి అడివి శేష్, షానీల్ డియో కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. ఈ చిత్రం 2022లో ప్రశంసలు పొందిన ‘మేజర్’ (Major) తర్వాత శేష్ యొక్క సెకెండ్ స్ట్రయిట్ హిందీ మూవీ కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. (Shruti Haasan Enters Dacoit Shoot)

Read Latest Cinema News

Updated Date - Jun 13 , 2024 | 04:17 PM