Adivi Sesh: అడివి శేష్ ట్వీట్‌కు అర్థం తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటోన్న నెటిజన్లు

ABN , First Publish Date - 2023-05-29T18:35:51+05:30 IST

యంగ్ హీరో అడివి శేష్ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కు అర్థం తెలియక నెటిజన్లే కాదు.. కొందరు సెలబ్రిటీలు కూడా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఇంతకీ అడివి శేష్ ఏమని ట్వీట్ చేశారంటే.. ‘వచ్చిన దారినే చూసుకోకపోతే.. ముందున్న దారిని ఎలా సరిదిద్దుకుంటాం?’ అని పేర్కొన్నారు. దీనికి అర్థం ఏమై ఉంటుంది? అంటూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Adivi Sesh: అడివి శేష్ ట్వీట్‌కు అర్థం తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటోన్న నెటిజన్లు
Hero Adivi Sesh

యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ (Tweet) ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కు అర్థం తెలియక నెటిజన్లే కాదు.. కొందరు సెలబ్రిటీలు కూడా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అసలు అడివి శేష్ చేసిన ట్వీట్‌కు అర్థమేంటి? ఇప్పుడాయనకు ఏం ప్రాబ్లమ్ వచ్చింది? రొటీన్‌గా కాకుండా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ.. హీరోగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న అడివి శేష్ ఇప్పుడలా ఎందుకు ట్వీట్ చేశాడు? అనేది ఆయన వివరణ ఇస్తేనేగానీ తెలియదు. ఇంతకీ అడివి శేష్ ఏమని ట్వీట్ చేశాడంటే..

‘వచ్చిన దారినే చూసుకోకపోతే.. ముందున్న దారిని ఎలా సరిదిద్దుకుంటాం?’ (Occhina daari ne chooskokapothe, mundhunna daarini ela sarididdhukuntaam?) అని అడివి శేష్ ట్వీట్ చేశాడు. దీనిని అనేక రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కానీ అడివి శేష్ మైండ్‌లో ఏముంది? అసలెందుకు ఇప్పుడీ ట్వీట్ ఆయన చేశాడు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ట్వీట్‌కు నెటిజన్లు, కొందరు సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్న తీరు మాత్రం నవ్వును తెప్పిస్తోంది. నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఈ ట్వీట్‌కు స్పందిస్తూ.. శేష్ ఏం చెబుతున్నాడు వెన్నెల కిషోర్ (Vennela Kishore).. ఏదో రహస్యంగా చెబుతున్నాడు. కొంపతీసి మనగురించేనా? అని కామెంట్ చేయగా.. ‘అవి ట్రాఫిక్ కోట్స్.. వదిలేసి వేరేవి చూసుకో’ అని వెన్నెల కిషోర్ రాహుల్‌కి రిప్లయ్ ఇచ్చారు. వీరి సంభాషణకు చిన్మయి కూడా ఎమోజీలతో రియాక్ట్ అయింది.

Adivi.jpg

ఇక నెటిజన్లు (Netizens) అయితే.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఏంటన్నా.. ఏంటి మ్యాటర్?’, ‘మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేమ్’, ‘ఏమైంది అన్నయ్యా?’, ‘కొంచెం అర్థమయ్యేట్టు చెప్పరాదే’, ‘టైటిల్ చాలా పెద్దగా ఉంది అన్నా’.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా నెటిజన్ల కామెంట్స్‌తో.. ప్రస్తుతం అడివి శేష్ చేసిన ఈ ట్వీట్ వైరల్ సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Adipurush: ‘రామ్ సీతా రామ్’ పాట ఓకే కానీ.. చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది

*Bro: పవన్-సాయితేజ్ ద్వయం పోస్టర్.. ఫ్యాన్స్‌కి ఈ భరోసా చాలు!

*Purandeswari: నాన్నగారిలా.. నూటికో కోటికో ఒక్కరే

*Jayapradha: ‘ఓసి.. ఆ పిల్లవి నువ్వెనన్నమాట’ అని ఎన్టీఆర్ పెద్దగా నవ్వేశారు

*Shaakuntalam: సినిమా సక్సెస్ కాలేదు కానీ.. ఆ విషయంలో మాత్రం తిరుగులేదు

*The India House: పవర్ ఫుల్ ఫిల్మ్‌తో ఖాతా తెరుస్తోన్న ‘V మెగా పిక్చర్స్’.. మోషన్ వీడియో అదిరింది

Updated Date - 2023-05-29T18:35:51+05:30 IST