మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Saripodhaa Sanivaaram: ‘గరం గరం’.. ఈ శనివారం స్పెషల్ ఇదే..

ABN, Publish Date - Jun 15 , 2024 | 03:48 PM

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. పాన్ ఇండియా ఫిల్మ్‌గా డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో మ్యాసీవ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌లో ఉన్న శనివారంకు కనెక్ట్ అయ్యేలా ప్రతి శనివారం మేకర్స్ ఏదో ఒక అప్డేట్ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ శనివారం స్పెషల్‌గా.. ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు.

Saripodhaa Sanivaaram Movie Still

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). పాన్ ఇండియా ఫిల్మ్‌గా డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో మ్యాసీవ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. ఈ యూనిక్ అడ్రినలిన్‌ అడ్వంచర్‌కి జేక్స్ బెజోయ్ (Jakes Bejoy) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌లో ఉన్న శనివారంకు కనెక్ట్ అయ్యేలా ప్రతి శనివారం ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఏదో ఒకటి అప్‌డేట్ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ శనివారం స్పెషల్‌గా మేకర్స్.. ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘గరం గరం’ (Garam Garam Lyrical Song) అంటూ సాగిన ఈ పాట ప్రస్తుతం మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

Also Read- Niharika Konidela: అల్లు అర్జున్‌ని సాయి దుర్గా తేజ్ అన్ ఫాలో చేయడంపై నిహారిక స్పందనిదే..

పాట విషయానికి వస్తే.. ఇది కొన్ని ఇంటెన్స్ బీట్స్ ఉన్న బ్యాంగ్ రాకింగ్ నంబర్. విశాల్ దల్దానీ ఈ పాటను అలపించారు. ఆయన డైనమిక్ వాయిస్ ఈ పాటకు పర్ఫెక్ట్ అనేలా ఉంది. సహపతి భరద్వాజ్ పాత్రుడు అందించిన లిరిక్స్.. హీరో నాని (Hero Nani) ఫెరోషియస్ క్యారెక్టర్‌ని డిఫైన్ చేస్తోంది. యాక్షన్‌తో కూడిన క్యారెక్టర్‌ను ప్రజెంట్ చేస్తోన్న ఈ పాటలో నాని కంప్లీట్ ఇంటెన్స్‌గా కనిపించారు. ఆర్ట్ వర్క్ ఈ పాటకు ఎడిషనల్ ఎట్రాక్షన్ అనేలా ఉంది.


నాని సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె. సూర్య (SJ Suryah) కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డివోపీగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 29 ఆగస్టు, 2024న (Saripodhaa Sanivaaram Release Date) భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 15 , 2024 | 03:54 PM