SDT18: పీరియాడిక్‌ హై యాక్షన్‌ డ్రామాగా.. సాయి దుర్గ తేజ్ 18వ చిత్రం

ABN , Publish Date - Jun 21 , 2024 | 05:31 PM

విరూపాక్ష, బ్రో’ చిత్రాలతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన కథానాయకుడు సాయి దుర్గ తేజ్‌ ఈసారి మరింత ఉత్సాహంతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని వదిలారు.

SDT18: పీరియాడిక్‌ హై యాక్షన్‌ డ్రామాగా.. సాయి దుర్గ తేజ్ 18వ చిత్రం
SDT18 Movie Poster

‘విరూపాక్ష (Virupaksha), బ్రో (Bro)’ వరుస విజయాల తర్వాత సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ (Sai Durgha Tej) నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ‘విరూపాక్ష, బ్రో’ చిత్రాలతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన కథానాయకుడు సాయి దుర్గ తేజ్‌ ఈసారి మరింత ఉత్సాహంతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రోహిత్‌ కేపీ (Rohith KP) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ‘హను-మాన్’ (Hanu Man) వంటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ (Primeshow Entertainments) పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రారంభమైనట్లుగా తెలుపుతూ.. అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను శుక్రవారం నిర్మాతలు విడుదల చేశారు.

Also Read- Konidela Nagababu: పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది..!


Sai-Durgha-Tej.jpg

ఈ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ గమనిస్తే.. ల్యాండ్ మైన్‌లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో ఒకే ఒక పచ్చని చెట్టు ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్‌ చూస్తుంటే ఓ యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లుగా అర్థమవుతోంది. ఈ పోస్టర్ విడుదల సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం గ్రాండ్ స్కేల్‌తో, భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నాం. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో సాయి దుర్గ తేజ్‌ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది. ఈ చిత్రం కోసమే నిర్మించిన ఓ భారీ సెట్‌లో ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా ఈ ఎస్‌డీటీ 18 (SDT18) రూపొందుతోంది. (SDT18 Announcement)

Read Latest Cinema News

Updated Date - Jun 21 , 2024 | 05:31 PM