Sai Durga Tej Gift: ఆయనలో చిన్నపిల్లాడికి ఈ గిఫ్ట్‌!

ABN , Publish Date - Jun 16 , 2024 | 01:46 PM

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఘన విజయం అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, జనసైనికుల్లో  ఆనందం అవధులు లేకుండా మారింది.

Sai Durga Tej Gift: ఆయనలో చిన్నపిల్లాడికి ఈ గిఫ్ట్‌!

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) ఘన విజయం అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, జనసైనికుల్లో  (Janasena) ఆనందం అవధులు లేకుండా మారింది. కూటమిలో భాగంగా 21 శాసనసభ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ అన్నిచోట్లా విజయకేతనం ఎగరవేసింది.  రాష్ట్ర ముఖమంత్రి చంద్రబాబు నాయుడు జనసేనానికి ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థి, పర్యావరణ, అటవీశాఖలను కేటాయించడంతో ఆ సంతోషం డబుల్‌ అయింది. 

ఈ నేపథ్యంలో చిరంజీవి సతీమణి (Surekha)సురేఖ.. పవన్‌కు అత్యంత ఖరీదైన పెన్నును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ (Sai dhaam tej) కూడా గురువుగా భావించే తన మావయ్య ఓ బహుమతి అందించారు. ఆ ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు.  ‘‘నాకు స్టార్‌వార్స్‌ లెగోను పరిచయం చేసింది మామయ్యే. ఆయనలోని పిల్లాడికి దాన్ని గిప్ట్‌గా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కింది’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు తేజ్‌. ఆ గిఫ్ట్‌ ధర దాదాపు రూ. 1,30,000 ఉంటుందని అంచనా. తన మామయ్య గెలుపుతో శనివారం.. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని, మొక్కు తీర్చుకున్నారు సాయిదుర్గ తేజ్‌. 

Updated Date - Jun 16 , 2024 | 01:46 PM