Ram NRI: ‘ఉయ్యాలా జంపాలా, శతమానం భవతి’ ఫ్లేవర్‌తో..

ABN, Publish Date - Jul 22 , 2024 | 08:08 PM

బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీ రెజా హీరోగా, సీతా నారాయణన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’. ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్ షిప్‌’ అనేది ఈ చిత్ర ఉపశీర్షిక. ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని జూలై 26న విడుదల గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు.

Ram NRI Pre Release Event

బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీ రెజా (Ali Reza) హీరోగా, సీతా నారాయణన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’ (Ram NRI). ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్ షిప్‌’ అనేది ఈ చిత్ర ఉపశీర్షిక. ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని జూలై 26న విడుదల గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ప్రసన్న కుమార్, లయన్ సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్, రామసత్య నారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (Ram NRI Movie Pre Release Event)

Also Read- Prakash Raj: మళ్ళీ వివాదంలో ప్రకాష్ రాజ్, తెలుగు ప్రేక్షకులంటే చిన్న చూపు


ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎన్.లక్ష్మీ నందా మాట్లాడుతూ.. నాకు సపోర్ట్ చేసిన నా టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా టీమ్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని కోరుకున్న వారంతా ముందుకు వచ్చి నా ఈవెంట్‌ను సక్సెస్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నానని అన్నారు.


సమర్పకులు ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ మాట్లాడుతూ.. ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన వారందరికీ థాంక్స్. నా మీద నమ్మకంతో నాకు ఈ చిత్రాన్ని ఇచ్చారు. జూలై 26న మా చిత్రం రాబోతోంది. ‘ఉయ్యాలా జంపాలా, శతమానం భవతి’ ఫ్లేవర్ నాకు కనిపించింది. ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ బ్యానర్ మీద ఏడాదికి ఆరు చిత్రాలైనా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. ప్రతీ చిన్న చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంటున్నాను. లక్ష్మీ నందా గారితో ఓ సోలో చిత్రాన్ని చేస్తున్నాను. మా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను’’ అని అన్నారు.

చిత్ర నిర్మాత మువ్వా సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ నిర్మించాం. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం. మా సినిమాను అందరూ ఆదరించండి’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరూ సినిమా ట్రైలర్ బాగుందని, కొత్త టీం కలిసి చేసిన ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలని, ఇలాంటి కొత్త వాళ్లు ఇండస్ట్రీలోకి ఇంకా రావాలని కోరుతూ.. సినిమా టీంకు శుభాకాంక్షలు తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Jul 22 , 2024 | 08:14 PM