Ram NRI: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ వదిలిన ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’లోని పాట

ABN , Publish Date - Jul 20 , 2024 | 11:32 PM

అలీ రెజా హీరోగా, సీతా నారాయణన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘రామ్ ఎన్ఆర్ఐ’. ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘తెల్లవారే వెలుగుల్లోనా’ అనే తొలి లిరికల్‌ వీడియోను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు.

Ram NRI Movie Song Launch Event

తెలుగు తెరపై రూపుదిద్దుకుంటోన్న మరో ఫీల్‌ గుడ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’ (Ram NRI). ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్ షిప్‌’ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీ రెజా (Ali Reza) హీరోగా, సీతా నారాయణన్‌ (Seetha Narayanan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘తెల్లవారే వెలుగుల్లోనా’ అనే తొలి లిరికల్‌ వీడియోను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh)విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ పాటను చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అందాలను ఒడిసి పట్టి చాలా అందమైన, అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించినట్లుగా కనిపిస్తుంది. ఈ పాట ద్వారా మంచి లోకేషన్స్‌ను దర్శక, నిర్మాతలు సెల్యూలాయిడ్స్‌పైకి తెచ్చినందుకు అభినందనలు. సినిమా విజువల్స్‌ చూస్తుంటే ది బెస్ట్‌ సాంకేతిక విలువలతో నిర్మించిన సినిమాలా అనిపిస్తుంది. నాగబాబు కర్రా అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ పాటలో కనిపిస్తుంది. మన మాతృభూమికి మనం ఎంతో కొంత చేయాలి. మన మూలాలను మరిచిపోకూడదు అనే ఆలోచనతో మంచి కాన్సెప్ట్‌తో, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడికి, నిర్మాతకు నా అభినందనలు. ఇంత మంచి సినిమాకు వర్క్‌ చేసిన టీమ్‌కు కూడా నా శుభాకాంక్షలు. ఈ నెల 21న జరగనున్న ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకతో పాటు ఈ చిత్రం కూడా విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. (Ram NRI Movie First Single)


Kandula.jpg

శ్రవణ్‌ సంగీతం సమకూర్చిన ‘తెల్లవారే వెలుగుల్లోనా’ అనే ఈ పాటకు రామాంజనేయులు యామినేని సాహిత్యం అందించగా, గాయకుడు రేవంత్‌ ఆలపించారు. పల్లె గొప్పతనాన్ని, గ్రామీణ అందాలను చూపిస్తూ తెరకెక్కిన ఈ పాట విజువల్‌గా కూడా ఆకట్టుకునేలా ఉంది. ‘పల్లెసీమకు ఎగిరే.. మనసే ఆనందంలో ఎగిరే.. ఊరివైపు పయనించే..’ అని పాడుతూ హీరో అలీ రెజా ఎంతో హుషారుగా.. ఎనర్జీగా ఈ పాటలో కనిపిస్తున్నారు. మంచి లిరికల్‌ విలువలతో కూడిన ఈ పాట వినగానే క్యాచీగా వుంది.

Updated Date - Jul 21 , 2024 | 01:00 AM