Game Changer: అభిమానుల నిరీక్షణ ఫలించింది.. అదిరిపోయే పోస్టర్‌తో అప్డేట్

ABN , Publish Date - Sep 07 , 2024 | 03:56 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీపై ఎటువంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా ఈ మూవీ నుంచి వినాయక చవితి శుభాకాంక్షలతో ఓ అదిరిపోయే పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. అలాగే సెకండ్ సింగిల్ రిలీజ్ అప్డేట్‌ కూడా ఇందులో తెలిపారు.

Global Star Ram Charan Starring Game Changer Poster

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). ఈ మూవీపై ఎటువంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఈ మూవీ నుంచి ఈ మధ్యకాలంలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో.. నిరాశకు లోనైన అభిమానులు అసభ్య పదజాలంతో చిత్రయూనిట్‌పై సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. దర్శకుడు శంకర్‌ను, నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ను ట్యాగ్ చేస్తూ.. నానా యాగీ చేస్తున్నారు. దీనిపై సంగీత దర్శకుడు థమన్ వారించినా.. అస్సలు వినకపోవడంతో.. చేసేది లేక మేకర్స్ ఈ వినాయక చవితిని పురస్కరించుకుని అదిరిపోయే పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. (Game Changer Update)

Also Read- Tollywood - Vinayaka Chavithi: దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. కరుణించయ్యా దేవా..

‘గేమ్ చేంజర్’ సెకండ్ సింగిల్ ఈ సెప్టెంబర్‌లో అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో రామ్ చరణ్‌ని చూసిన మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. కారణం ఈ పోస్టర్‌లో ఫ్యాన్స్ ఏం కావాలో అది ఇచ్చేశారు మేకర్స్. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ తలకు ఎర్ర కండువా కట్టి.. ‘జనసేన’కు లింక్ అయ్యేలా చేయడమే కాకుండా.. జాతరకు సిద్ధమవ్వండి అనేలా జాతర సెటప్‌తో.. చరణ్ స్టెప్ వేస్తున్న పిక్‌ని మేకర్స్ వదిలారు. ఇప్పుడీ పోస్టర్ అన్నింటికీ సమాధానం చెబుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినాయక చవితి శుభాకాంక్షలతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ పోస్టర్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.


Global-Star-Ram-Charan.jpg

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘జరగండి జరగండి..’ సాంగ్‌ సెన్సేషన్‌ని క్రియేట్ చేయగా.. ఇప్పుడు సెకండ్ సింగిల్ అప్డేట్‌తో కొన్ని రోజుల పాటు ఈ సినిమా ట్రెండ్‌లో హల్చల్ చేయనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని క్రిస్మ‌స్ స్పెషల్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది.

Read Latest Cinema News

Updated Date - Sep 07 , 2024 | 03:56 PM

Game Changer Audio Rights : ఆడియో రైట్స్‌కు ఎన్ని కోట్లంటే...

Game Changer : పాట లీక్‌పై నిర్మాత దిల్‌రాజు ఫైర్‌

Game Changer : షార్ట్‌ షెడ్యూల్‌ ఉండే అవకాశం ఉందట!

Game Changer: మెగా మాస్‌ బ్లాస్ట్‌..వచ్చేస్తుంది

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..