Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

ABN , Publish Date - Aug 07 , 2024 | 01:14 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ వర్క్స్ మొదలైనట్లుగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

Ram Charan in Game Changer Movie

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్‌ మినహా సరైన అప్డేట్ మాత్రం ఇప్పటి వరకు మేకర్స్ నుంచి రాలేదనే చెప్పుకోవాలి. ఈ విషయంలో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు.. ఇకపై అప్డేట్స్ బీభత్సంగా ఉంటాయనేలా హింట్ వచ్చేసింది. అవును.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ అధికారిక అప్డేట్‌ను ఇచ్చారు.

Also Read- Prabhas: ప్రభాస్ ఫర్ ఏ రీజన్.. వయనాడ్ బాధితుల సహాయార్థం భారీ విరాళం

అదేంటంటే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగించుకుని డబ్బింగ్ కార్యక్రమాలను (Dubbing Works) జరుపుకుంటున్నట్లుగా.. అందుకు సంబంధించిన ఫొటోలతో మేకర్స్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ (SVC) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు ఫ్యాన్స్‌కు ఉన్న అనుమానాలు తొలగినట్లయింది. ఇంత వరకు సినిమా షూటింగ్ ఏ స్టేజ్‌లో ఉందో తెలియందు. డిసెంబర్ రిలీజ్ అంటున్నారా? డిసెంబర్‌కి నిజంగా ‘గేమ్ చేంజర్’ విడుదల ఉంటుందా? అనే మెగాభిమానులకు ఈ అప్డేట్ కాస్త క్లారిటీని ఇచ్చినట్లయింది. దీంతో.. ‘గేమ్ చేంజర్’ ట్యాగ్‌ని వారు వైరల్ చేస్తూ.. ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. (Game Changer in Trending) విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య (SJ Suryah) కూడా ట్విట్టర్ వేదికగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు యమా జోరుగా జరుగుతున్నట్లుగా వెల్లడించారు.


Game-Changer-1.jpg

రీసెంట్‌గా హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) పుట్టినరోజును పురస్కరించుకుని ‘గేమ్ ఛేంజ‌ర్’ నుంచి ఆమె లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. చూపు తిప్పుకోవ‌టం క‌ష్టం అనేంత బ్యూటీగా కియారా ఈ లుక్‌లో క‌ట్టి ప‌డేసింది. ఇక లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రాల‌ను అబ్బుర‌ప‌రిచే రీతిలో తెర‌కెక్కించే శంకర్ ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ‘గేమ్ చేంజర్’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. క్రిస్మ‌స్ (Game Changer Release) సంద‌ర్భంగా ఈ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Game-Changer-2.jpg

Read Latest Cinema News

Updated Date - Aug 07 , 2024 | 01:15 PM

Game Changer: మెగా మాస్‌ బ్లాస్ట్‌..వచ్చేస్తుంది

Game Changer Update: శంకర్ లేకపోయినా షూటింగ్ ఆగలేదు

Game Changer: అనుకున్నదే అయ్యింది.. ‘జరగండి’ దీపావళికి రావడం లేదు

Game Changer: జాబిల‌మ్మ జాకెట్టెసుకొచ్చెనండి.. జ‌ర‌గండి జ‌ర‌గండి పాటొచ్చింది

Game Changer: హమ్మయ్యా.. ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్