Pranayagodari: నిర్మాత రాజ్ కందుకూరి వదిలిన ‘ప్రణయగోదారి’ పవర్‌ఫుల్ గ్లింప్స్
ABN , Publish Date - Jul 20 , 2024 | 09:54 PM
న్యూ కంటెంట్‌తో, రిఫ్రెషింగ్ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’ అని అంటున్నారు దర్శకుడు పి.ఎల్.విఘ్నేష్. ఆయన దర్శకత్వంలో ఈ పారమళ్ళ లింగయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
న్యూ కంటెంట్‌తో, రిఫ్రెషింగ్ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’ (Pranayagodari) అని అంటున్నారు దర్శకుడు పి.ఎల్.విఘ్నేష్ (PL Ganesh). ఆయన దర్శకత్వంలో ఈ పారమళ్ళ లింగయ్య (Lingaiah Paramalla) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు. హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ (Sai Kumar) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను నిర్మాత రాజ్ కందుకూరి (Raj Kandukuri) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
గ్లింప్స్ విడుదల అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి’ గ్లింప్స్ చాలా బాగుంది. కంటెంట్ చూస్తుంటే అన్నివర్గాల ప్రేక్షకులని అలరించే కంటెంట్ ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో సాయికుమార్ డైలాగ్స్ అన్నీ చాలా ఆసక్తికరంగా.. పవర్‌ఫుల్‌గా వున్నాయి. చిత్రం ప్రేక్షకుల ఆదరణతో చాలా మంచి సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా యూనిట్‌కు నా అభినందనలు అని అన్నారు. అనంతరం చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా గ్లింప్స్ విడుదలవడం ఆనందంగా వుంది. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారిని అలరించే అంశాలున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతిని కలిగించే కథతో వస్తోంది. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. (Pranayagodari Movie Glimpse)
ఈ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇందులోని సన్నివేశాలు, సంభాషణలు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో పెదకాపు పాత్రలో ఊరి పెద్దలాగా కనిపిస్తున్నారు. ఆయన చెప్పిన డైలాగులు.. ‘తప్పు ఎవరు చేసినా తీర్పు ఒక్కటే’, ‘ఆకాశానికి హద్దుండదు ఈ పెదకాపు మాటకు తిరుగుండదు’, ‘నే పుట్టిన ఈ గోదారి తల్లి మీద ఒట్టు’ అని సాయికుమార్ తన పవరఫుల్ డైలాగులతో మెస్మరైజ్ చేశారు. ‘ప్రాణం పోయినా సహిస్తాను.. భరిస్తాను.. నా సహనాన్ని, మంచితనాన్ని పరీక్షించొద్దు’ అనే డైలాగుతో చాలా రౌద్రంగా కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆయన పాత్రలోని గంభీరత్వం కూడా కనిపిస్తుంది. గ్లింప్స్‌ను చూస్తే సినిమా మొత్తానికి సాయికుమార్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా కనిపిస్తోంది. గోదారి నది ఒడ్డున హీరో హీరోయిన్ల ఆటలు, వారి ప్రేమాయణం సన్నివేశాలు చూస్తుంటే యూత్‌ని అలరించే అంశాలు ఇందులో పుష్కలంగా వున్నట్లు తెలుస్తోంది.