Pranaya Godari: అంబర్ పేట్ శంకరన్న వదిలిన ‘ప్రణయ గోదారి’ టైటిల్ పోస్టర్

ABN , Publish Date - Jun 12 , 2024 | 09:29 PM

సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా పిఎల్‌వి క్రియేషన్స్‌పై ‌పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ఈ చిత్రానికి పి.ఎల్. విఘ్నేష్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్‌ను సంఘ సేవకులు అంబర్ పేట్ శంకరన్న ఆవిష్కరించారు. హీరో సదన్ కమెడియన్ అలీ ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

Pranaya Godari: అంబర్ పేట్ శంకరన్న వదిలిన ‘ప్రణయ గోదారి’ టైటిల్ పోస్టర్
Pranaya Godari Title Poster Launch

సదన్ (Sadan) హీరోగా, ప్రియాంక ప్రసాద్ (Priyanka Prasad) హీరోయిన్‌గా పిఎల్‌వి క్రియేషన్స్‌పై ‌పారమళ్ళ లింగయ్య (Paramalla Lingaiah) నిర్మిస్తున్న చిత్రం ‘ప్రణయ గోదారి’ (Pranaya Godari). ఈ చిత్రానికి పి.ఎల్. విఘ్నేష్ (PL Vignesh) దర్శకుడు. తాజాగా ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్‌ను సంఘ సేవకులు అంబర్ పేట్ శంకరన్న (Amberpet Shankaranna) ఆవిష్కరించారు. హీరో సదన్ కమెడియన్ అలీ ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అలీ సోదరుడి కుమారుడు సదన్. ఇంకా ఇందులో సాయికుమార్, 30 ఇయర్స్ పృథ్వి, జబర్దస్త్ రాజమౌళి, సునిల్ రావినూతల వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

Also Read- Mega vs Allu: మరోసారి రివీలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం


చిత్ర టైటిల్ పోస్టర్ విడుదల అనంతరం అంబర్ పేట్ శంకర్ మాట్లాడుతూ.. ‘చిన్న చిత్రాలకు సినీ పరిశ్రమలోని అందరూ అండగా నిలవాలి. చిన్న సినిమా అయినప్పటికీ ఈ ‘ప్రణయ గోదావరి’ మంచి కంటెంట్‌తో వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. నిర్మాతగా పారమళ్ల లింగయ్యకు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్‌తో పాటు, డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నానని అన్నారు. (Pranaya Godari Movie Title Poster Launched)


Pranaya Godari.jpg

నిర్మాత పారమళ్ళ లింగయ్య (Producer Paramalla Lingaiah) మాట్లాడుతూ.. నాకెంతో ఇష్టమైన అంబర్ పేట్ శంకరన్న ‘ప్రణయ గోదారి’ పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు సంతోషంగా ఉంది. దర్శకుడు పి.ఎల్. విఘ్నేష్ ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు రిచ్ అయ్యే కంటెంట్‌తో తెరకెక్కించారు. మార్కండేయ సంగీత దర్శకుడిగా, ఈదర ప్రసాద్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అందరూ ఆదరించి మా చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని కోరుతున్నట్లుగా తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో యాదయ్య గౌడ్, కాలే రమేష్, వరికుప్పల వెంకట్ రాములు(వీవీఆర్), అసిస్టెంట్ డైరెక్టర్ గంట శ్రీనివాస్ వంటివారు పాల్గొన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 12 , 2024 | 09:32 PM