Pranayagodari: సంగీత దిగ్గజం కోటి ఆవిష్కరించిన ‘ప్రణయగోదారి’ సాంగ్

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:40 PM

పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్ హీరోగా పరిచయం అవుతుండగా.. ప్రియాంక ప్రసాద్, సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘కలలో కలలో’ అంటూ సాగే ఫీల్ గుడ్ సాంగ్‌ని సంగీత దిగ్గజం కోటి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Pranayagodari: సంగీత దిగ్గజం కోటి ఆవిష్కరించిన ‘ప్రణయగోదారి’ సాంగ్
Music Director Koti Launches Pranayagodari Song

ఈ మధ్య ప్రేక్షకులు న్యాచురాలిటీని ఎక్కువగా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఓటీటీలు వచ్చిన తర్వాత సరికొత్త కథలు, కంటెంట్‌తో పాటు దర్శకనిర్మాతలు న్యాచురల్ లొకేషన్స్‌‌కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇదంతా ప్రేక్షకులని మెప్పించడానికే. అలా ప్రేక్షకులని మెప్పించేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘ప్రణయగోదారి’ (Pranayagodari). పిఎల్ విఘ్నేష్ (PL Vignesh) దర్శకత్వంలో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో కమెడియన్ అలీ (Comedian Ali) ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్ (Sadan) హీరోగా పరిచయం అవుతుండగా.. ప్రియాంక ప్రసాద్, సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘కలలో కలలో’ (Kalalo Kalalo Song) అంటూ సాగే ఫీల్ గుడ్ సాంగ్‌ని సంగీత దిగ్గజం కోటి (Music Director Koti) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.


Koti.jpg

‘కలలో కలలో..’ అంటూ హాయిగా సాగిపోతున్న ఈ ప్రేమ గీతంలో లవ్ బీట్ వినసొంపుగా ఉంది. ఇక గోదావరి అందాలు, న్యాచురల్ లొకేషన్స్‌లో షూట్ చేసిన సీన్స్ ఫ్రెష్ ఫీలింగ్‌ని ఇస్తున్నాయి. హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్‌తో పాటు సైడ్ డాన్సర్స్ లుక్స్ కూడా ఈ పాటలో ఆకర్షణీయంగా మారాయి. పాట విడుదల అనంతరం సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి’లోని ఈ సాంగ్ చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతోంది. అన్ని వర్గాల ఆడియన్స్ మెచ్చేలా ఈ సాంగ్ షూట్ చేశారు. పాటలోని లిరిక్స్, బీట్, అందుకు తగ్గ సన్నివేశాలు, నటీనటుల వేషధారణ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. కాగా, పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న యూనిట్.. మరోవైపు జోరుగా ప్రమోషన్స్‌ను మొదలెట్టారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 23 , 2024 | 06:40 PM